Begin typing your search above and press return to search.

దేవ్ డీ తో పోలికలు.. సందీప్ వంగా రెస్పాన్స్

By:  Tupaki Desk   |   2 Jun 2019 1:24 PM GMT
దేవ్ డీ తో పోలికలు.. సందీప్ వంగా రెస్పాన్స్
X
'అర్జున్ రెడ్డి' సినిమాతో సంచలనం సృష్టించిన దర్శకుడు సందీప్ వంగా ఇప్పుడు ఆదే సినిమా హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' తో బిజీగా ఉన్నాడు. షాహిద్ కపూర్.. కియారా అద్వాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా జూన్ 21 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్స్ లో జోరు పెంచారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోస్ తో సినిమాపై భారీ ఆసక్తి వ్యక్తం అవుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో సందీప్ కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది.

అభయ్ డియోల్ హీరోగా తెరకెక్కిన 'దేవ్ డి' ప్రభావం 'కబీర్ సింగ్' పై ఉందా అని అడిగితే "ఆ సినిమా వేరు కబీర్ సింగ్ వేరు. ఆ సినిమా ప్రభావం ఈ సినిమాపై ఉండదు. ఎందుకంటే కబీర్ సింగ్ యాంగర్ ఇష్యూస్ ఉండే ఒక హృదయం గాయపడిన వ్యక్తి కథ.. కానీ దేవ్ డీ లో హీరో పాత్రకు ఏది ప్రేమ.. ఏది కామం అనే క్లారిటీ ఉంటుంది. దేవ్ డీలో హీరోకు తనే ముఖ్యం. రెండు సినిమాలకు తేడా ఉంది." అంటూ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు.

ఒరిజినల్ సినిమాకు రీమేక్ కు పెద్దగా తేడాలు ఉండవని.. ప్రాంతం.. భాష.. హీరో.. సాంగ్స్ మాత్రం మారతాయని అన్నాడు. 'కబీర్ సింగ్' అవుట్ పుట్ పై కూడా సందీప్ సంతృప్తిని వ్యక్తం చేశాడు. మరి రీమేక్ కూడా ఒరిజినల్ లాగానే సంచలనం సృష్టిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.