Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి ఓ డ్రగ్ అట..

By:  Tupaki Desk   |   22 Aug 2017 7:35 AM GMT
అర్జున్ రెడ్డి ఓ డ్రగ్ అట..
X
అర్జున్ రెడ్డి సినిమా ఒక డ్రగ్ లాంటిది అన్నాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. దాని గురించి అతను వివరిస్తూ.. ‘‘అర్జున్ రెడ్డి లెంగ్త్ 3 గంటల 1 నిమిషం 42 సెకన్లు. చాలామంది అడిగారు నన్ను.. ఇంత పెద్ద సినిమా ఎలా అని. ఈ ఫిలిం ఎమోషనలీ డ్రివెన్ హెవీ డ్యూటీ కల్ట్ రొమాన్స్. మామూలుగా అంటుంటారు మంచి సినిమా ఇంటికొస్తది.. కూర్చుంటది.. మాట్లాడతది అని. మార్కెట్లో కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఒక డ్రగ్ కొడితే.. మెదడులో రేడియో ల్యూసెంట్ ఇమేజెస్ ఉండిపోతాయి. ఆ డ్రగ్ తీసుకుంటే 20 ఏళ్ల తర్వాత కూడా దొరికిపోతారు. ‘అర్జున్ రెడ్డి’ కూడా ఆ డ్రగ్ లాంటిదే. అలాగే బ్రెయిన్లో రేడియో ల్యూసెంట్ ఇమేజ్ లాగా నిలిచిపోతుంది.

‘అర్జున్ రెడ్డి’ టీజర్.. ట్రైలర్ చూసి సినిమాలో ఏదో ఉందని థియేటర్లకు వచ్చేవాళ్లందరినీ ఈ చిత్రం సంతృప్తి పరుస్తుంది. నిజానికి ఈ సినిమాను శర్వానంద్ చేయాల్సింది. అశ్వినీదత్ కూతు స్వప్న నిర్మించాల్సింది. కానీ కుదర్లేదు. స్వప్ననే ‘అర్జున్ రెడ్డి’ పాత్రకు విజయ్ ను రెఫర్ చేసింది. సీనియర్ నటి కాంచన గారు 34 ఏళ్ల తర్వాత ఈ సినిమా కోసం నటించారు. 34 ఏళ్లుగా ఏం చేయాలో.. ఏం మాట్లాడాలో.. ఏం వేసుకోవాలో తనకెవరూ చెప్పలేదని ఆవిడన్నారు. ఆమెను నా సినిమాలో నటింపజేయడం నాకు దక్కిన గౌరవం. ఈ సినిమా పిల్లలకు కాదు. పెద్దోళ్లకు మాత్రమే. అంటే మెదడు ఎదిగిన పెద్దవాళ్లకని అర్థం. నిజానికి మెచ్యూర్డ్ గా ఆలోచించే 14-16 ఏళ్ల వాళ్లు కూడా ఈ సినిమా చూడొచ్చు. ‘ఎ’ రేటెడ్ ఫిలిమే అయినప్పటికీ కుటుంబమంతా వచ్చి సినిమా చూడొచ్చు. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ అన్నీ పక్కకు వెళ్లిపోతాయి. అందరూ కనెక్టవుతారు. పిల్లలు పెద్ద వాళ్లకు.. పెద్దవాళ్లు పిల్లలకు ఈ సినిమా గురించి వివరించవచ్చు. సెన్సార్ వాళ్లు వైవా చేసినట్లుగా మాతో డీల్ చేశారు. టీవీలకు ఈ టీజర్.. ట్రైలర్ ఎలా ఇచ్చావు అని అడిగారు. కానీ మా ప్రమేయం లేకుండా టీవీల్లో వేసుకున్నారని చెప్పాను. అలా మా సినిమాను ప్రమోట్ చేసిన అందరికీ థ్యాంక్స్’’ అని సందీప్ అన్నాడు.