Begin typing your search above and press return to search.

అల్లు అర్జున్.. అర్డున్ రెడ్డి అయితే..

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:00 AM GMT
అల్లు అర్జున్.. అర్డున్ రెడ్డి అయితే..
X
ఇవాళ రిలీజ్ అవుతున్న విజయ్ దేవరకొండ మూవీ అర్జున్ రెడ్డికి.. ముందు రోజు రాత్రే ప్రివ్యూలు వేసేసిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే.. హీరో రేంజ్ కు మించి జరుగుతున్నాయని అనడంలో సందేహం లేదు. సహజంగా ఇలాంటి సినిమాలు రిలీజ్ అయ్యాక.. టాక్ ప్రకారం హైప్ రావాలి. పెళ్లి చూపులు విషయంలో జరిగిందిదే. కానీ ఆ తర్వాత వచ్చిన ద్వారక డిజప్పాయింట్ చేయడంతో.. ఈసారి రూట్ మార్చిన హీరో.. అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ ను రియల్ లైఫ్ లో చూపిస్తూ(అలా యాక్ట్ చేస్తూ) బాగానే హైప్ తెచ్చారు.

అయితే.. వివాదాల ప్రచారంతో పాటు.. సహజంగా పబ్లిసిటీ యాక్టివిటీస్ అయిన ఇంటర్వ్యూల తంతు కూడా మరోవైపు జరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా దర్శకుడు సందీప్ వంగా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. విజయ్ దేవరకొండ కాకుండా.. ప్రస్తుతం స్టార్స్ గా ఉన్నవారిలో అయితే.. ఈ అర్జున్ రెడ్డి పాత్రకు అల్లు అర్జున్ సరిగ్గా సరిపోతాడని అన్నాడు. స్టైలిష్ స్టార్ అయితే.. ఈ పాత్రను ఇరగదీసేసేవాడని కాన్ఫిడెంట్ గా కూడా చెప్పాడు దర్శకుడు. అంతే కాదు.. ఈ స్టోరీని అల్లు అర్జున్ కి చెప్పేందుకు ట్రై చేశానని కూడా అనడం విశేషం.

అల్లు అర్జున్ కి ఆరేళ్ల క్రితమే ఓ కధ చెప్పానన్న సందీప్ వంగా.. అది అర్జున్ రెడ్డి కాదని అన్నాడు. ఇప్పుడు అర్జున్ రెడ్డి విషయంలో కూడా యాక్ట్ చేయమని అడిగేందుకు కాకపోయినా.. కథ చెప్పేందుకు ట్రై చేశాడట. కానీ ఆరేళ్ల క్రితం బన్నీ వేరని.. ఇప్పటి స్టైలిష్ స్టార్ రేంజ్ మారిపోయిందని.. అందుకే కథ చెప్పడానికి కుదరలేదని చెప్పిన సందీప్.. ఒక వేళ విజయ్ దేవరకొండ హీరో కాకపోయి ఉంటే మాత్రం.. ప్రాజెక్ట్ ఔట్ పుట్ ఇలా ఉండేది కాదని చెప్పడం విశేషం.