Begin typing your search above and press return to search.

అర్జున్ రెడ్డి తరువాత ఏం చేస్తున్నాడంటే

By:  Tupaki Desk   |   26 Aug 2017 8:03 AM GMT
అర్జున్ రెడ్డి తరువాత ఏం చేస్తున్నాడంటే
X
ఈతరం యువ దర్శకులు ఆలోచిస్తున్న తీరును చూస్తుంటే టాలీవుడ్ రూల్స్ ని బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు అనే చెప్పాలి. ఇప్పటివరకు ఒకే లెవెల్ లో ఆలోచిస్తున్న దర్శకులకు భిన్నంగా ఆలోచిస్తూ వారి సత్తాను చాటుకుంటున్నారు. అంతే కాకుండా ప్రేక్షకులకు కూడా కొత్త విధానంలో సినిమాలను చూడాలని వారికి కూడా కొంచెం ట్రీట్ మెంట్ ఇస్తున్నారని అర్ధమవుతోంది.

అందుకు ఉదాహరణగా రీసెంట్ గా వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా అని ఖచ్చితంగా చెప్పాల్సిందే. ట్రైలర్స్ తోనే ఈ సినిమా కొత్తగా ఉండబోతుందని అందరికి అనిపించేలా చేశాడు దర్శకుడు సందీప్ వంగ. ఎందుకంటే సినిమాలో దర్శకుడు అనేక రూల్స్ ని బ్రేక్ చేశాడు. ఒక తెలుగు సినిమా ఇలానే ఉంటుంది అన్న ట్రాక్ ని మార్చేసి రివర్స్ లో వెళితే ఎలా ఉంటుందని చెప్పడంలో 80% సక్సెస్ అయ్యాడు. అర్జున్ రెడ్డి విడుదలైన మొదటిరోజే మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. మరి అలాంటి హిట్ అందుకున్న ఈ దర్శకుడు నెక్స్ట్ ఎవరితో సినిమా తీస్తాడు అని అందరిలో ఆసక్తిని రేపుతోంది.

అయితే సందీప్ మొదట అర్జున్ రెడ్డి కథను శర్వానంద్ కి వినిపించాడు కానీ అది చివరకి విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లడంతో అతను మంచి అవుట్ఫుట్ ఇచ్చి సక్సెస్ అయ్యాడు. అయితే సందీప్ తన నెక్స్ట్ సినిమా శర్వానంద్ తోనే తీయబోతున్నాడట. రీసెంట్ గా శర్వా కి ఒక డిఫరెంట్ కథని వినిపించడంతో అతను ఒకే చెప్పాడని తెలుస్తోంది. అది కూడా అర్జున్ రెడ్డి సినిమాను నిర్మించిన తన హోమ్ బ్యానర్ లోనే తెరకెక్కిస్తున్నాడట. అయితే సాఫ్ట్ గా ఉండే శర్వానంద్ కి మరి ఈ బోల్డ్ డైరెక్టర్ కి ఎలా సెట్ అవుతుందో చూడాలి.