Begin typing your search above and press return to search.

మ‌హేష్ మూవీ ఉందంటున్న రెడ్డి

By:  Tupaki Desk   |   27 April 2018 10:46 AM GMT
మ‌హేష్ మూవీ ఉందంటున్న రెడ్డి
X
‘అర్జున్ రెడ్డి’ సినిమాలో టాలీవుడ్ లో పెను సంచ‌ల‌న‌మే సృష్టించాడు ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా. బోల్డ్ కంటెంట్ తో బ్యూటీఫుల్ సినిమా తీసి యువ‌త‌రాన్ని తెగ మెప్పించేశాడు. ఈ సినిమాతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ ఓవ‌ర్ నైట్ స్టార్ అయిపోయిన సంగ‌తి తెలిసిందే. అలాంటి ద‌ర్శ‌కుడితో సినిమా చేసేందుకు చాలామంది కుర్ర హీరోలు ఎదురుచూస్తున్నా... మ‌నోడి టార్గెట్ మాత్రం మ‌హేష్ పైనే ఉంది.

‘అర్జున్ రెడ్డి’ మూవీ చూసిన త‌ర్వాత సందీప్ రెడ్డితో సినిమా చేసేందుకు ఆస‌క్తి చూపించాడు సూప‌ర్ స్టార్‌. ఇంత‌కు ముందు అత‌నితో సినిమా చేయ‌బోతున్న‌ట్టు కూడా ప్ర‌క‌టించాడు మ‌హేష్‌. అయితే ‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా ప్ర‌మోష‌న్లో పాల్గొన్న సంద‌ర్భంగా మ‌హేష్ ఫ్యూచ‌ర్ ప్రాజెక్టు గురించి చెప్పిన‌ప్పుడు మాత్రం సందీప్ రెడ్డి సినిమా విష‌యం చెప్ప‌లేదు. దాంతో సందీప్ రెడ్డి- మ‌హేష్ బాబు కాంబినేష‌న్లో సినిమా రావ‌డం అనుమాన‌మే అనుకున్నారంతా. అయితే సందీప్ మాత్రం మ‌హేష్ ప్రాజెక్టును వ‌దిలేట్టు లేడు. తాజాగా ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న సందీప్ ప్ర‌స్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ తెరకెక్కించే ప‌నిలో ఉన్నాన‌ని... వీలైనంత త్వ‌ర‌లో దాన్ని పూర్తి చేసి మహేష్ ప్రాజెక్టు మీద ప‌నిచేయబోతున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

అయితే 26వ సినిమాను సుకుమార్ తో ప్ర‌క‌టించాడు మ‌హేష్‌. అయితే సుక్కూ స్కిప్టు రెఢీ చేయ‌డానికి చాలా టైం ప‌డుతుంది. కాబ‌ట్టి వంశీ పైడిప‌ల్లి సినిమా అయిపోగానే సందీప్ - సుకుమార్ ఎవ‌రు స్కిప్టుతో రెఢీగా ఉంటే... వారితో సినిమా చేయాల‌ని ఫిక్స్ అయ్యాడ‌ట సూప‌ర్ స్టార్‌. ‘అర్జున్ రెడ్డి’ తో బోల్డ్ ల‌వ్ స్టోరీ తీసిన సందీప్‌... మ‌హేష్ కోసం ఓ ప్ర‌యోగాత్మ‌క స్క్రిప్టు రెఢీ చేయాల‌నుకుంటున్న‌ట్టు స‌మాచారం.