Begin typing your search above and press return to search.

మూడేళ్లుగా చూస్తున్న సరైన అమ్మాయి కనిపించలేదట!!

By:  Tupaki Desk   |   17 Jun 2020 11:00 PM IST
మూడేళ్లుగా చూస్తున్న సరైన అమ్మాయి కనిపించలేదట!!
X
యంగ్‌ హీరోలు వరుసగా పెళ్లిలు చేసుకుని ఒక ఇంటి వారు అవుతున్నారు. ఇటీవల హీరో నిఖిల్‌ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిన విషయం తెల్సిందే. త్వరలో నితిన్‌ మరియు రానాల వివాహం కూడా జరుగబోతుంది. ఆమద్య సాయి ధరమ్‌ తేజ్‌ వివాహం కూడా త్వరలో జరిగే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక నిహారిక పెళ్లి చేసిన వెంటనే వరుణ్‌ తేజ్‌ పెళ్లి కూడా చేస్తానంటూ నాగబాబు ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఈ ఏడాది వచ్చే ఏడాది టాలీవుడ్‌ లో చాలా పెళ్లిలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక టాలీవుడ్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అయిన మరో హీరో సందీప్‌ కిషన్‌. 33 ఏళ్ల ఈ యంగ్‌ హీరో పెళ్లి చేసుకునేందుకు రెడీగానే ఉన్నాడట.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి ప్రస్థావన వచ్చిన సమయంలో మూడు సంవత్సరాలుగా పెళ్లి చేసుకునేందుకు రెడీగా ఉన్నా కూడా ఇప్పటి వరకు తనకు సరైన అమ్మాయి తరసపడలేదన్నాడు. తనకు జోడీగా సరైన అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పుడైతే సరైన జోడీ దొరుకుతుందో వెంటనే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ సందీప్‌ కిషన్‌ వ్యాఖ్యలు చేశాడు. హీరోగా సెటిల్‌ అయ్యేందుకు ఇంకా తీవ్రంగా కష్టపడుతున్న ఈ యంగ్‌ స్టార్‌ త్వరలో ఏ1 ఎక్స్‌ ప్రెస్స్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌ హాకీ ఆటగాడిగా కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్‌ లుక్‌ ను బట్టి అర్థం చేసుకోవచ్చు. సందీప్‌ కిషన్‌ కు వచ్చే ఏడాది అయినా సక్సెస్‌ దక్కి సరైన జోడీ అమ్మాయి దొరకుతుందా చూడాలి.