Begin typing your search above and press return to search.

A1 బాడీ బిల్డ్ చేసిన A1 ఎక్స్ ప్రెస్ హీరో!

By:  Tupaki Desk   |   7 May 2020 2:40 PM IST
A1 బాడీ బిల్డ్ చేసిన  A1 ఎక్స్ ప్రెస్ హీరో!
X
అందరూ లాక్ డౌన్ లోనే ఉన్నారు. అందరూ ఇంటిపట్టునే ఉన్నారు. అయితే కొందరు సెలబ్రిటీలు తమకు దొరికిన సమయన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సమంతా ఆన్లైన్ యాక్టింగ్ క్లాసులకు హాజరవుతోంది. సందీప్ కిషన్ చూస్తే ఒక్కసారిగా సిక్స్ ప్యాక్ ఫిజిక్ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

సందీప్ మొదటి నుండి స్లిమ్ గా ఉండేవాడే కానీ కండలు పెంచడం.. సిక్స్ ప్యాక్ లాంటి వాటి జోలికి ఎందుకో పోలేదు. అయితే ఈ సారి లాక్ డౌన్ వల్ల వచ్చిన టైం లో ఫిట్నెస్ పై దృష్టి సారించి పర్ఫెక్ట్ షేప్ లో కి వచ్చాడు. షర్టు తీసేసి మరీ ఫోటో షూట్ చేసి ఆ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా షేర్ చెయ్యడం విశేషం. ఈ ఫోటోలో మీసాలు. గడ్డం పెంచి రఫ్ లుక్ లో ఉన్నాడు. లాక్ డౌన్ వల్ల చాలామందికి ఏం చెయ్యాలో తోచడం లేదు కానీ అలాంటి వారికి సందీప్ కిషన్ లాంటి సెలబ్రిటీలు ప్రేరణగా నిలుస్తున్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే సందీప్ ప్రస్తుతం 'A1 ఎక్స్ ప్రెస్' లో నటిస్తున్నాడు. ఈ సినిమా కాకుండా మరో రెండు ప్రాజెక్టులు లైన్లో పెట్టాడని అంటున్నారు. మరి ఈ కొత్త లుక్ రాబోయే సినిమాల కోసమే అని అర్థం అవుతోంది కదా.