Begin typing your search above and press return to search.

మళ్లీ టైం కలిసొస్తుందా?

By:  Tupaki Desk   |   18 March 2016 3:30 PM GMT
మళ్లీ టైం కలిసొస్తుందా?
X
మూడేళ్ల క్రితం సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ అనూహ్య విజయాన్ని సాధించింది. అంతకు ముందు కూడా కొన్ని సినిమాలు చేసినా.. సందీప్ కి సోలో హీరోగా ఇదే తొలిసినిమా. రకుల్ ప్రీత్ సింగ్ తో కలిసి ఈ కుర్రాడు చేసిన జెట్ స్పీడ్ హంగామా బాగా క్లిక్ అయింది.

సూపర్ హిట్ గా నిలిచి, సందీప్ కిషన్ ను టాలీవుడ్ లో హీరోగా స్థానం అందించింది వెంకటాద్రి ఎక్స్ ప్రెస్. కానీ.. ఆ మూవీ విడుదలై 3 ఏళ్లు గడుస్తున్నా.. ఆ తర్వాత ఇప్పటివరకూ ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయాడు సందీప్ కిషన్. ఇప్పుడు రాబోతున్న రన్ మూవీ ఆ లోటును తీరుస్తుందని ఆశలు పెట్టుకున్నాడు. ఆ మూవీతో, రన్ ని పోల్చడానికి కారణాలు ఉన్నాయి. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ కూడా.. కాలంతో పాటు పరిగెట్టే మూవీనే. ఓ సమయంలోగా కంప్లీట్ చేయాల్సిన టాస్క్ అనే కాన్సెప్ట్ పై నడుస్తుంది. ఇప్పుడు రన్ చిత్రంలో టైం చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తోంది.

నిజానికి ఇలా టైం బేస్డ్ మూవీలు జనాలను థ్రిల్ కి గురిచేస్తాయి. స్క్రీన్ ప్లే ఆకట్టుకుంటే .. జనాలనుంచి ఆదరణ బాగా ఉంటుంది. స్టార్ కాస్టింగ్ తో సంబంధం లేకుండా జనాలను థ్రిల్ చేయగల సత్తా.. ఇలాంటి కాలంతో పరిగెట్టే సినిమాలకు ఉంటుంది. మరి ఈ రన్ తో అయినా.. సందీప్ కిషన్ ఆశించిన సక్సెస్ సాధిస్తాడేమో చూద్దాం.