Begin typing your search above and press return to search.

దానికి రెడీ అంటున్న యువ హీరో

By:  Tupaki Desk   |   8 March 2019 1:30 AM GMT
దానికి రెడీ అంటున్న యువ హీరో
X
యువ హీరో సందీప్ కిషన్ సినిమాలు ఈమధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశపరుస్తున్నాయి కానీ సందీప్ ఏమాత్రం అధైర్యపడకుండా సినిమాలు చేసుకుంటూపోతున్నాడు. సందీప్ కు ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో ఉన్నాయి. అందులో ఒకటి తమిళ చిత్రం 'నరగసూరన్'(తెలుగులో 'నరకాసురుడు').. రెండో సినిమా 'నిను వీడని నీడను నేను'.

రెండో సినిమాను సందీప్ తన సొంత బ్యానర్ వెంకటాద్రి మూవీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నాడు. నిర్మాతగా సందీప్ కు ఇదే మొదటి సినిమా. ఇదిలా ఉంటే సందీప్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నిర్మాతగా తన సినిమాలను మాత్రమే కాదు మంచి కాన్సెప్టులు ఉంటే ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మించేందుకు సిద్ధం అని చెప్పాడు. కానీ వెంకటాద్రి మూవీస్ బ్యానర్లో రెండో సినిమా గురించి ఇతర వివరాలేవీ వెల్లడించలేదు.

'నిను వీడని నీడను నేను' సినిమా విషయానికి వస్తే దాదాపు షూటింగ్ అంతా పూర్తి చేసుకుందట. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ మొదలుపెడతారట. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు కార్తీక్ రాజు దర్శకుడు. అన్యా సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో హిట్ సాధించి మళ్ళీ ట్రాక్ లోకి వస్తానని నమ్మకంగా ఉన్నాడు సందీప్.