Begin typing your search above and press return to search.

కుర్ర హీరోని సేఫ్ చేసిన వీడని నీడ

By:  Tupaki Desk   |   15 Jun 2019 12:24 PM IST
కుర్ర హీరోని సేఫ్ చేసిన వీడని నీడ
X
చివరి హిట్ ఎప్పుడు వచ్చింది అంటే కాసేపు అలోచించి కాని వెంటనే తానైనా చెప్పలేని పరిస్థితిలో ఉన్న హీరో సందీప్ కిషన్ ఇప్పుడు ఆశలన్నీ నిను వీడని నీడను మీదే పెట్టుకున్నాడు. కథను దర్శకుడు చెప్పిన విధానం నచ్చి తనే స్వయంగా నిర్మాతగా మారిన సందీప్ ఊహించని విధంగా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే సేఫ్ అవుతున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఇంతకు ముందే విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్పాన్స్ దక్కడంతో పాటు సినిమాలో విషయం ఉందనే నమ్మకం ట్రేడ్ లో కలగడంతో మంచి డీల్స్ ఇచ్చారట.

పెట్టుబడి మొత్తం వీటి రూపంలోనే వచ్చేయడంతో శాటిలైట్ ప్లస్ డిజిటల్ ద్వారా వచ్చేది మొత్తం లాభం కిందకు వస్తుంది కాబట్టి నిను వీడని నీడను మీద కుర్రాడి నమ్మకం వమ్ము కానట్టే కనిపిస్తోంది. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన ఒత్తిడిలో సందీప్ కిషన్ రిస్క్ గా అనిపించే హారర్ జానర్ ను ఎంచుకున్నాడు. వ్యక్తిగతంగా దెయ్యాల సినిమాలంటే భయపడే సందీప్ వెరైటీగా తన స్వంత సినిమా మాత్రం అందులోనే చేయడం ట్విస్ట్.

అయితే విడుదల విషయంలో హీరో కం నిర్మాత తొందరపడేలా లేడు. అనవసరమైన పోటీకి వెళ్లి నలిగిపోవడం కన్నా సేఫ్ రిలీజ్ చూసుకుని ఇటు బయ్యర్లు లాభపడి తనకూ పేరు వచ్చేలా సరైన తేది కోసం టీంతో చర్చలు జరుపుతున్నాడని తెలిసింది. ఆగష్టు నుంచి చాలా టఫ్ కాంపిటీషన్ ఉండటంతో వచ్చే నెల రిలీజ్ చేయడం గురించి ఇంకా ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. త్వరలో ప్రకటన వచ్చే అవకాశం ఉంది