Begin typing your search above and press return to search.

#DRUGS సంజ‌న Vs రాగిణి.. బాంబ్ బెదిరింపు త‌ర్వాత ఇంత‌కీ ఏం జ‌రిగింది?

By:  Tupaki Desk   |   23 Oct 2020 9:15 AM IST
#DRUGS సంజ‌న Vs రాగిణి.. బాంబ్ బెదిరింపు త‌ర్వాత ఇంత‌కీ ఏం జ‌రిగింది?
X
శాండల్ వుడ్ డ్రగ్ కుంభకోణం కేసులో అరెస్ట‌యిన క‌థానాయిక‌లు సంజనా గల్రానీ - రాగిణి ద్వివేది ని జైల్లో ఇంత‌వ‌ర‌కూ ఒక్కరు కూడా మీట‌వ్వ‌లేద‌ట‌. మొదటి రోజు నుండి ఇప్ప‌టివ‌ర‌కూ క‌నీసం బంధుమిత్రులు కానీ వేరే ఎవ‌రూ కానీ సంద‌ర్శించలేద‌న్న జైల‌ర్ల వివ‌ర‌ణ‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది.

క‌న్న‌డ‌ చిత్ర పరిశ్రమలో మాదకద్రవ్యాల కుంభకోణం తాజా కేసుపై వివ‌రాల్ని ఆరా తీస్తే.. ఆ ఇద్ద‌రు నాయిక‌ల‌ సందర్శన‌కు వ‌చ్చిన వివరాలు కోరుతూ ఆర్టీఐ ప్రశ్నించ‌గా.. ఈ విష‌యం తెలిసింది. జైలులో ఉన్నప్పటి నుండి వీరిద్దరూ ఒక్క సందర్శకుడిని కూడా రాలేదని పరపన్న అగ్రహార జైలు అధికారులు తెలిపారు.

నటీమణుల సందర్శకుల గురించి జైలు అధికారులు ఎలాంటి వివరాలు తయారు చేయలేదని.. ఈ ప్రత్యేక కేసులో జైలు సందర్శకుల జాబితా ఇవ్వ‌లేద‌ని కార్యకర్త నరసింహమూర్తి ఆర్టీఐ ప్రశ్నను దాఖలు చేశారు. ఇది ప్ర‌చారంలోకి వ‌చ్చిన అనంత‌రం కొన్ని రోజుల క్రితం న్యాయమూర్తి కోర్టుకు రాసిన లేఖ ద్వారా అత‌డు ఎదుర్కొన్న‌ బాంబు బెదిరింపు ల వ్య‌వ‌హారంపైనా విస్తృతంగా చర్చ సాగింది. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న తార‌లు రాగిణి ద్వివేది..., సంజన గల్రానీలను వీలైనంత త్వరగా విడుదల చేయాలని లేదా న్యాయమూర్తి పర్యవసానాలను ఎదుర్కోవలసి ఉంటుందని ఒక లేఖలో డిమాండ్ చేయ‌డం అగ్గిరాజేసింది.

ఈ కేసు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు కమిషనర్ కమల్ పంత్ .. ఇతర ఉన్నతాధికారులకు ఇలాంటి బెదిరింపులు ఎదుర‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. కవరుతో పాటు.. వైర్లు ... డిటోనేటర్ల ముక్కలు వంటి అనుమానాస్పద పదార్థాలు కూడా కనుగొనడంతో పోలీసులు దీనిపై కంగారు ప‌డ్డారు. గత వారం రాగిణి ద్వివేది .. సంజన జ్యుడిషియల్ కస్టడీని ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు అక్టోబర్ 23 వరకు పొడిగించింది. బాంబ్ బెదిరింపుల‌పై త‌దుప‌రి ప‌ర్య‌వ‌సానం ఏమిట‌న్న‌ది తెలియాల్సి ఉంది.