Begin typing your search above and press return to search.

ఒక ప్రేమ‌క‌థ శాపానికి గురైంది

By:  Tupaki Desk   |   8 Dec 2015 4:37 AM GMT
ఒక ప్రేమ‌క‌థ శాపానికి గురైంది
X
ర‌విబాబు ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కించిన అవును సినిమాతో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే పేరు ఫిలింస‌ర్కిల్స్‌ లో - ఆడియెన్‌ లో మార్మోగింది. ఆ త‌ర్వాత‌ నీల‌కంఠ 'మాయ' సినిమాతో మ‌రింతగా పాపులారిటీ పెరిగింది. మీడియం రేంజ్ హీరోగా అత‌డికి ఐడెంటిటీ ద‌క్కింది ఈ సినిమాల‌తోనే. ఇవే సినిమాల‌తో అత‌డికి బాలీవుడ్‌ లోనూ గుర్తింపు వ‌చ్చింది. ఫ‌ర్వాలేదు.. సాలిడ్‌ గానే పెర్ఫామ్ చేస్తున్నాడు అన్న గుర్తింపు వ‌చ్చింది. దాంతోనే అక్క‌డ ఓ అవ‌కాశం అత‌డిని వెతుక్కుంటూ వ‌చ్చింది.

స‌న‌మ్ తేరీ క‌స‌మ్ అనేది సినిమా టైటిల్‌. ఇదో చ‌క్క‌ని ప్రేమ‌కథా చిత్రం. ప్ర‌తి ప్రేమ‌క‌థ‌కు ఏదో ఒక శాపం ఉంటుంది. అన్న‌ట్టే ఈ ప్రేమ‌క‌థ కూడా శాపానికి గుర‌వుతుంది.. అని చూపించ‌బోతున్నారుట‌. లేటెస్టుగా ఫ‌స్ట్‌ లుక్ పోస్ట‌ర్ రిలీజైంది. టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే ప్రేమ కు చిహ్నంగా ఉందీ పోస్ట‌ర్‌. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే త‌న ప్రేయ‌సితో ప్లెజెంట్ పొజిష‌న్ లో రొమాన్స్ చేసే స్టిల్ యూత్‌ ని ఆక‌ట్టుకుంటోంది. గులాబీ రేకుల మ‌ధ్య స్నానాల ట‌బ్‌ లో ఉన్న ప్రేయ‌సిని గోముగా ముద్దాడుతున్న ప్రేమికుడిగా రాణే క‌నిపించాడు.

ఎలానూ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ఉత్త‌రాది కుర్రాడే కాబ‌ట్టి మూవీకి బాగా సింక‌యిపోయిన‌ట్టే క‌నిపిస్తోంది. ఈ సినిమాతో సౌత్ నుంచి నార్త్‌ కి ప్ర‌మోట్ అవుతాడేమో చూడాలి. ప్రేమ శాపానికి గురైనా సినిమా శాపానికి గుర‌వ్వ‌క‌పోతే మ‌నోడె సెట్ట‌యిన‌ట్టే.