Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కుచ్ కుచ్ పిల్ల బికినీ రచ్చ

By:  Tupaki Desk   |   13 April 2018 4:48 PM GMT
ఫోటో స్టోరి: కుచ్ కుచ్ పిల్ల బికినీ రచ్చ
X
సినిమా ఇండస్ట్రీలో కొందరు అమ్మాయిలు ఎప్పటికప్పుడు వారి స్టైల్ తో సరికొత్తగా కనిపిస్తూ షాక్ ఇస్తారనేది అందరికి తెలిసిందే. నిన్న చీరలో కనిపించిన నటి ఈ రోజు సడన్ గా బికినిలో కనిపించిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అలాగే సీరియల్ బ్యూటిలు కూడా షాక్ లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. గ్లామర్ పాత్రలకు వీరు అస్సలు ఒప్పుకోరు అనుకున్నవాళ్లకు ఆ రోల్స్ చేసి సవాల్ విసురుతున్నారు.

ఇకపోతే అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపికంచిన ఒక బ్యూటీ సీరియల్స్ వరకు ఇన్నోసెంట్ గానే కనిపించింది. కానీ మోడల్ ప్రపంచంలో ఫొటో షూట్స్ కి వచ్చే సరికి తన అందంతో కుర్రకారు మైండ్ చెదరగొట్టేసింది. ఆమె ఎవరో కాదు. 1998 లో వచ్చిన కుచ్ కుచ్ హోతా హై సినిమా గుర్తుంది కదా. ఆ సినిమాలో అంజలి అనే పాత్రలో అల్లరి చేస్తూ కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చిన సనా సయీద్.. సీరియల్స్ తో ఎక్కువగా పాపులర్ అయిన సన కొన్ని షోల్లో కూడా కనిపించింది.

అయితే రీసెంట్ గా సనా సయీద్ కనిపించిన తీరు అందరిని షాక్ కి గురి చేసింది. ఏకంగా బికినీ లుక్ లో కనిపించి స్టన్ అయ్యేలా చేసింది. ఇంతకుముందు కూడా సన హాట్ గా దర్శనమిచ్చింది. కానీ మరీ ఈ రేంజ్ లో కాదు. న్యూ ఉమెన్ మ్యాగజైన్ కి ఇచ్చిన బికినీ ఫోటో షూట్ ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. చూస్తుంటే స్టార్ హీరోయిన్స్ కి ఈజీగా పోటీ ఇచ్చేలా కనిపిస్తోందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.