Begin typing your search above and press return to search.

స్పై కెమెరాలపై స‌నా `మిస్డ్ కాల్ ` ఉద్య‌మం!

By:  Tupaki Desk   |   25 Dec 2017 11:03 AM GMT
స్పై కెమెరాలపై స‌నా `మిస్డ్ కాల్ ` ఉద్య‌మం!
X
కొన్ని షాపింగ్ మాల్స్ - ఆఫీసులు - హోట‌ళ్లు - రెస్టారెంట్లు - హాస్ట‌ళ్లు వంటి ప్ర‌దేశాల‌లో స్పై (ర‌హస్య‌) కెమెరాల‌తో కొంద‌రు నీచులు మ‌హిళ‌ల వీడియోలు చిత్రీక‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌రికొంద‌రు ఏకంగా బాత్రూమ్ లు - బెడ్రూమ్ ల‌లో ర‌హ‌స్య కెమెరాల‌ను ఏర్పాటు చేసి మ‌హిళ‌లు - దంప‌తుల న‌గ్న వీడియోల‌ను కూడా చిత్రీక‌రించి ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయ‌డం వంటి దుర్మార్గాల‌కు పాల్ప‌డుతున్న ఉదంతాల గురించి మ‌నం వింటూనే ఉన్నాం. ఆ కెమెరాలు అక్క‌డ ఉన్నాయ‌న్న సంగతి కూడా బాధితుల‌కు తెలియ‌ని ప‌రిస్థితులు కూడా ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. అందుబాటులోకి వ‌చ్చిన టెక్నాల‌జీతో కొందరు దుర్మార్గులు ఇటువంటి దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో...మార్కెట్లో ఇబ్బడి ముబ్బ‌డిగా దొరుకుతున్న‌ స్పై కెమెరాల నియంత్రణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని సినీనటి సన అన్నారు. హెవెన్‌ హోమ్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో `యాంటీ రెడ్‌ ఐ క్యాంపెయిన్` బ్రోచ‌ర్ ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.

సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కూ ఈ స్పై కెమెరాల బారిన ప‌డ‌తున్నార‌ని స‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సాక్ష్యాత్తూ....కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా ఆ ఇబ్బందుల‌కు గురి కావ‌డం శోచ‌నీయ‌మ‌న్నారు. స్పై కెమెరాల అమ్మకాల నియంత్రణ - కఠిన చట్టాలు త‌యారు చేయాల‌ని కోరుకునే వారంతా 80992 59925 నెంబర్ కు మిస్డ్‌ కాల్‌ ఇవ్వాలని చెప్పారు. ఓటింగ్‌ ద్వారా ఈ స‌మ‌స్య‌ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామ‌ని చెప్పారు. ఆన్‌ లైన్ లో రూ.250కే స్పై కెమెరాలు దొరుకుతున్నాయ‌ని - వాటి వెనుక ఉన్న మాఫియా ఉందన్నారు. హీరోయిన్లు సమంత - మెహరీన్ తో ఈ విషయం గురించి చ‌ర్చించాన‌ని - మిగిలిన ఇండ‌స్ట్రీల వారి నుంచి మ‌ద్దతు తీసుకొని `కోటి మిస్డ్‌ కాల్‌` ల కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. మ‌హిళ‌లంతా ఈ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తివ్వాల‌ని కోరారు.