Begin typing your search above and press return to search.

క్రెడిట్ అంతా అత్తారింటిదే!!

By:  Tupaki Desk   |   19 March 2016 3:30 PM GMT
క్రెడిట్ అంతా అత్తారింటిదే!!
X
సన షనూర్ బేగం.. ఇలా చెబితే కన్ఫ్యూజ్ కావచ్చు కాన.. యాక్టర్ సన అంటే మంత్రం టక్కున ఓ చిరునవ్వుతో ఉండే ఫేస్ కళ్ల ముందు కదులుతుంది. అంతగా టాలీవుడ్ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన కేరక్టర్ ఆర్టిస్ట్ సన. గత 18 ఏళ్లుగా 500లకు పైగా సినిమాల్లో నటించిన ఈమె.. మూడు భాషల్లో మూవీస్ చేస్తుండడం విశేషం. తను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం తన అత్తవారిల్లే అని చెబుతోంది ఈమె.

ధనవంతుల కుటుంబంలో పుట్టిన సనకు.. 14వ ఏట, పెళ్లి అంటే ఏంటో తెలిసేందుకు ముందే నిఖా జరిగిపోయిందట. అయితే.. ఆ తర్వాత మోడల్ కావాలనే ఓ అడ్వర్టైజ్మెంట్ చూసి అప్లై చేస్తే, ముందు అత్తవారు వ్యతిరేకించినా, తర్వాత మద్దతునిచ్చారని తెలిపింది. అందరిలోకి భర్త సయ్యద్ సదాత్ ఇచ్చే సపోర్ట్ కారణంగానే తాను ఇప్పుడీ స్థితిలో ఉన్నానని చెబుతోంది సన. ఓ సారి షూటింగ్ కోసం బెంగళూరు వెళ్లాల్సి ఉండగా.. ఫ్లైట్ మిస్ అయిందట. సరే అని ఇంటికి తిరిగి వెళ్లి పోదామని భర్తకి చెప్పి, కార్ ఎక్కి నిద్రపోయిందట సన.

పొద్దున లేచి చూసే సరికి.. బెంగళూరు పొలిమేరల్లో ఉన్నట్లు గుర్తించానని.. అదేంటని అడిగితే.. నిద్రపోతుంటే నువ్వు చాలా అందంగా ఉన్నావ్ అందుకే లేపలేదు, చెప్పలేదు అన్నాడట సన భర్త. తన వృత్తి ప్రకారం ఇంతగా మద్దతునిచ్చే భర్త, అత్తారిల్లు దొరకడమే... ఇప్పుడు తను ఈ స్థాయికి చేరుకోగలగడానికి కారణం అని చెప్పిన సన.. సినిమాలు చేస్తూనే ఉంటానని, సెట్స్ లోనే చనిపోవాలని తన కోరిక అని నవ్వుతూ చెబుతోంది.