Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: కిర్రాక్ బ్యూటీ!!

By:  Tupaki Desk   |   2 Jun 2018 4:52 AM GMT
ఫోటో స్టోరి: కిర్రాక్ బ్యూటీ!!
X
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందాలంటే అందాల ఆరబోత తప్పనిసరి అనే మాటలకు కొందరు హీరోయిన్స్ సరైన న్యాయం చేస్తున్నారు. ఆఫర్లు ఎన్ని వస్తున్నాయో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కొందరు సైడ్ క్యారెక్టర్స్ చేసే వారు కూడా హాట్ ఫొటోలతో షాక్ ఇస్తున్నారు. సెకండ్ హీరోయిన్ గా చేసిన ముద్దుగుమ్మలు కూడా సెక్సీ లుక్స్ తో అదరగొడుతున్నారు.

ఇక రీసెంట్ గా ఒక కన్నడ బ్యూటీ కూడా అదే తరహాలో షాక్ ఇచ్చింది. అమ్మడు తెలుగులో కూడా ఒక సినిమా చేసింది. ఆమె ఎవరో కాదు. కిర్రాక్ర్ పార్టీలో సెకండ్ హీరోయిన్ గా చేసిన సంయుక్త హెగ్డే. అయితే కన్నడ సినిమాకు రిమేక్ గా వచ్చిన ఆ సినిమాలో ఒరిజినల్ క్యారెక్టర్ చేసింది కూడా ఈ బ్యూటీనే. ఇకపోతే పైన పోటీ చూస్తుంటే ఆమె నిజంగా సంయుక్తేనా అనే డౌట్ రాకుండా ఉండదు. హాట్ క్లివేజ్ షోతో ప్యాంట్ లో కనిపించిన ఈ బ్యూటీ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.

చూస్తుంటే హాట్ గ్లామర్ పాత్రలకు నేను రెడీ అని చెప్పకనే చెబుతోంది. ఇక సంయుక్త కన్నడ లో ప్రస్తుతం ఒక సినిమా చేస్తోంది. తెలుగులో హిట్ అవుతుంది అనుకున్న కిర్రాక్ పార్టీ కొంచెం కూడా హిట్ అవ్వలేదు. కన్నడ లో రికార్డులు సృష్టించిన ఆ సినిమా ఇక్కడ పెట్టిన బడ్జెట్ లో కనీస వసూళ్లను కూడా అందుకోలేదు.