Begin typing your search above and press return to search.

వైరల్: సెన్సువల్ డ్యాన్స్ తో మతిపోగొడుతోందే!

By:  Tupaki Desk   |   27 April 2019 10:20 AM GMT
వైరల్: సెన్సువల్ డ్యాన్స్ తో మతిపోగొడుతోందే!
X
కన్నడ భామ సంయుక్త హెగ్డే తెలుసు కదా.. నిఖిల్ 'కిరాక్ పార్టీ' సినిమాలో హీరోయిన్. అయితే ఈమధ్య కన్నడ సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది. అప్పుడప్పుడు ఫిఫీ లాంటి ద్వీపాలకు వెళ్ళి అక్కడ హాటు పోజులు ఇస్తుంటుంది. ఇక రీసెంట్ గా ఒక క్రేజీ డ్యాన్స్ చేసింది. ఆ వీడియో ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది..అది కాస్తా వైరల్ అయింది.

డ్యాన్స్ అందరూ చేస్తారు కదా అందులో ప్రత్యేకత ఏముంది? అని మీరు ప్రశ్నిస్తే చాలు.. చాలా చాలా ఇంట్రో ఇవ్వాల్సి ఉంటుంది. సల్సా డ్యాన్స్ అని.. బెల్లీ డ్యాన్స్ అని వెస్ట్రన్ లో చాలా రకాల డ్యాన్స్ లు ఉంటాయి కదా. అలాంటివాటిలో ఒక డ్యాన్స్ ఫామ్ బచట. ఇది చాలా సాఫ్ట్ గా సెన్సువల్ గా ఉండే డ్యాన్స్ ఫామ్. మీకు తీరిక దొరికితే యూట్యూబ్ లో వీడియోలు చూసేయండి.. మైండ్ బ్లోయింగ్ గా ఉంటాయి. సరిగ్గా సంయుక్త హెగ్డే ఆ డ్యాన్సే చేసింది. ఈ డ్యాన్స్ కు ఆమె ఇచిన క్యాప్షన్ "అర్బన్ కిజోంబా". ఈ పేరు కింద చాలా పాటలు ఉన్నాయి. ఇందులో ఒక పాటకే సంయుక్త డ్యాన్స్ చేసింది.

ఒక స్లీవ్ లెస్ టీ షర్టు.. జస్ట్ మిల్లీ మీటర్లలో లెంగ్త్ ఉండే ఒక మైక్రో నిక్కర్ ధరించి బచట డ్యాన్స్ చేస్తూ తన డ్యాన్స్ పార్టనర్ కు తగ్గట్టు ఒక రిథంలో రచ్చ చేసేసింది. కొన్ని మూమెంట్స్ కు మతి పోతుందంతే. ఇది మామూలు బచట కాదు.. సెన్సువల్ బచట. అందుకే ఇన్స్టాగ్రామ్ లో ఈ వీడియో కు 7 లక్షల లైకులు వచ్చాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది ఈ వీడియో.. మీరు ఒకసారి చూసేయండి.