Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్' కీలకపాత్రలో స్టార్ డైరెక్టర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?

By:  Tupaki Desk   |   24 Jun 2020 10:10 AM GMT
ఆర్ఆర్ఆర్ కీలకపాత్రలో స్టార్ డైరెక్టర్.. రెమ్యూనరేషన్ ఎంతంటే..?
X
టాలీవుడ్ ఇండస్ట్రీ ఇతర బాషా నటులకు ఎల్లప్పుడూ స్వాగతం పలుకుతూనే ఉంటుంది. తెలుగువాళ్లు సక్సెస్ అవుతారో లేదో కానీ పరభాషా నటులు మాత్రం బాగానే క్లిక్ అవుతున్నారు. తెలుగు సినిమాలకు కావాల్సిన టాలెంట్ ఎక్కడున్నా వెతికిమరి తీసుకొస్తారు మన దర్శకనిర్మాతలు. గతం నుండి ఇప్పటి వరకు తమిళ, కన్నడ, మలయాళం నటులు మన ఇండస్ట్రీలో సక్సెస్ అయినవాళ్లే. హీరోలు హీరోయిన్లే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా హీరో అంతటి ఇమేజ్ పొందుతున్నారు. అయితే టాలీవుడ్లో దర్శకుడి నుండి నటుడిగా మారిన సముద్రఖని మంచి క్రేజ్ అందుకుంటున్నాడు.


రవితేజ, అల్లరి నరేష్ హీరోలుగా 'శంభో శివ శంభో' సినిమా.. అలాగే నానితో 'జెండా పై కపిరాజు' సినిమాలు రూపొందించాడు. కానీ 2015లో ధనుష్ హీరోగా రూపొందిన 'రఘువరన్ బిటెక్' సినిమాలో తండ్రి క్యారెక్టర్ తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అయితే ఇంతకాలం డబ్బింగ్ సినిమాలతో పలకరించిన సముద్రఖని.. 'అల వైకుంఠపురంలో' సినిమాతో తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో తెలుగులో గ్యాప్ లేకుండా ఆఫర్స్ తలుపు తడుతున్నాయి. కానీ ఈ స్టార్ యాక్టర్ మాత్రం కేవలం తనకు నచ్చిన సినిమాలే చేస్తున్నాడు.

తెలుగులో ఇటీవలే రవితేజ హీరోగా రూపొందుతున్న 'క్రాక్' సినిమాలో విలన్ రోల్ చేస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం సముద్రఖని.. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ లో ఓ ప్రముఖ పాత్రలో కనిపించబోతున్నాడట. అయితే ఈ సినిమా కోసం ఆయన ఏకంగా రూ.2కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. వచ్చిన ఆఫర్లన్నీ ఓకే చేయకుండా కేవలం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలకే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడట. ఇక ఆయన రెమ్యూనరేషన్ బట్టే సినీ ఇండస్ట్రీలో ఆశ్చర్యపోతున్నారు. దీంతో దర్శకులు కూడా సముద్రఖనిని కీలక పాత్రల కోసమే ఎంపిక చేసుకుంటున్నారని టాక్.