Begin typing your search above and press return to search.

RRR స్టార్ పోస్టర్ లో ఏదో మార్మిక‌త దాగుంది

By:  Tupaki Desk   |   10 Dec 2020 10:19 AM IST
RRR స్టార్ పోస్టర్ లో ఏదో మార్మిక‌త దాగుంది
X
దర్శకుడు కం నటుడు సముదిర‌కని ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. త‌మిళంలో పెద్ద స్టార్. తెలుగులోనూ ఆయ‌న న‌టించిన సినిమాలు ఆక‌ట్టుకున్నాయి. ఇరు భాషలలో సుపరిచితమైన పేరు. ప్రస్తుతం అతడు రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ RRR లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. వ‌రుస‌గా ప‌లు క్రేజీ తెలుగు సినిమాల‌కు సంత‌కాలు చేసి టాలీవుడ్ లో బిజీ అవుతున్నాడు సుముద‌రిక‌ని.

ఈ గురువారం ఉదయం సముదిర‌కని న‌టిస్తున్న కొత్త చిత్రం పోస్టర్ విడుద‌లైంది. ఈ సినిమా టైటిల్ `రైటర్`. ఫస్ట్ లుక్ పోస్టర్ కి స్పంద‌న బావుంది. ముఖ్యంగా ఆ టైటిల్ కి త‌గ్గ‌ట్టే పోస్ట‌ర్ లో మార్మిక‌త ఆక‌ర్షిస్తోంది. కబాలి దర్శకుడు పా. రంజిత్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 96 ఫేం కీర్తి గోవింద్ వసంత సంగీత స్వరకర్త.

ఆర్.ఆర్.ఆర్ లాంటి పాన్ ఇండియా చిత్రంలో న‌టిస్తున్న స్టార్ గా స‌ముదిర‌క‌ని బ్రాండ్ మార్మోగ‌డం ఖాయం. అటుపై రిలీజ‌య్యే అత‌డి చిత్రాల‌కు డ‌బ్బింగ్ రైట్స్ కి శాటిలైట్ డిజిట‌ల్ రిలీజ్ ల‌కు డిమాండ్ ఏర్ప‌డుతుంద‌న‌డంలో సందేహం లేదు.