Begin typing your search above and press return to search.

ఈ మూవీకి స్టార్ విలన్ హైలైట్ కాబోతున్నాడా..??

By:  Tupaki Desk   |   27 April 2021 11:01 AM IST
ఈ మూవీకి స్టార్ విలన్ హైలైట్ కాబోతున్నాడా..??
X
తమిళ డైరెక్టర్ కం స్టార్ యాక్టర్ సముద్రఖని పుట్టినరోజు సందర్బంగా తాజాగా ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు పంచతంత్రం సినిమా మేకర్స్. ఈ సినిమాలో సముద్రఖని 60ఏళ్లు పైబడిన వృద్ధుడి పాత్రలో కనిపించనున్నాడు. అయితే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన మేకర్స్ ఈ సినిమాలో సముద్రఖని క్యారెక్టర్ చాలా హైలైట్ అవుతుందని చెప్పుకొచ్చారు. అలాగే ఈ సినిమాలో సముద్రఖని ఓ రిటైర్డ్ బ్యాంకు ఎంప్లాయ్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఫస్ట్ లుక్ చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాలో ఆయన పాత్ర ప్రతి ఒక్కరి జీవితంలో తమ తండ్రిని తలపిస్తుందని చెప్పారు. మరో పది రోజులలో పంచతంత్రం షూటింగ్ పనులు పూర్తవుతాయట. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగా జరుగుతుందని తెలిపారు.

అయితే ఈ సినిమాలో సముద్రఖనితో పాటుగా బ్రహ్మానందం, స్వాతి, శివాత్మిక రాజశేఖర్, రాహుల్ విజయ్, నరేష్ అగస్థ్య కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ లైఫ్ డ్రామా సినిమాను పులిపాక హర్ష తెరకెక్కిస్తున్నాడు. అఖిలేష్ వర్ధన్, సృజన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నేషనల్ అవార్డు యాక్టర్ ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. తెలుగులో పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ సినిమాలో కీలకపాత్ర పోషిస్తూనే మరోవైపు మీడియం సినిమాలు కూడా చేస్తున్నాడు. క్రాక్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి విలన్ గా ఎంట్రీ ఇచ్చిన సముద్రఖని.. ఇదివరకు శంభోశివశంభో లాంటి సూపర్ హిట్ సినిమాలను డైరెక్ట్ చేసాడు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆయన హాట్ టాపిక్ గా మారారు.