Begin typing your search above and press return to search.

మరోసారి బన్నీ సినిమాలో స్టార్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   22 March 2021 3:30 PM GMT
మరోసారి బన్నీ సినిమాలో స్టార్ యాక్టర్..!
X
స్టైలిష్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. స్టైలిష్ సినిమాల డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సుకుమార్-బన్నీ కాంబినేషన్లో ఇదివరకు ఆర్య, ఆర్య 2 సినిమాలు హిట్ అవ్వగా.. ఇప్పుడు హ్యాట్రిక్ సినిమాగా రెడీ అవుతున్న పుష్ప సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదట్లో ఈ సినిమాను అయిదు భాషల్లో రిలీజ్ చేస్తామని చెప్పినప్పటి నుంచి అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అన్న టాక్ బాగా సాగుతుంది. అలాగే సుకుమార్, అల్లు అర్జున్ ఈ సినిమాతో భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకోవాలని చాలా కష్టపడుతున్నారు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగనుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‌గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాలో బన్నీకి జోడీగా కుర్రహీరోయిన్ రష్మిక మందన్న నటిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలోని ఓ ఎస్సై పాత్రలో తమిళ స్టార్ యాక్టర్ సముద్రఖని నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదివరకు బన్నీతో కలిసి సముద్రఖని 'అలవైకుంఠపురంలో' సినిమాలో నటించాడు. ఈసారి పుష్పలో కూడా వీరి కాంబినేషన్ సెట్ అయినట్లు టాక్. అయితే ఇదివరకు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కూడా పుష్పలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని మేకర్స్ ప్రకటించారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేక ఈ సినిమా నుండి తప్పుకున్నాడు విజయ్. మరి ఇప్పుడు సముద్రఖని చేయనున్న పాత్ర విజయ్ కాదనుకున్న పాత్రేనా లేక వేరేనా అనేది తెలియాల్సి ఉంది. చూడాలి మరి మేకర్స్ ఈ విషయం పై క్లారిటీ ఇస్తారేమో!