Begin typing your search above and press return to search.

ఉత్త సముద్ర కాదు.. విజయ సముద్ర

By:  Tupaki Desk   |   8 April 2015 5:00 AM IST
ఉత్త సముద్ర కాదు.. విజయ సముద్ర
X
సినీ పరిశ్రమలో ఉన్నన్ని సెంటిమెంట్లు, మూఢ నమ్మకాలు ఇంకెక్కడా ఉండవని అంటారు. చాలాసార్లు అది నిజమే అనిపిస్తుంటుంది. ఇక్కడ డైరెక్టర్‌ సముద్రను చూడండి. ఉన్నట్లుండి ఆయన పేరు విజయ సముద్ర అయిపోయింది. ఉత్త సముద్ర అంటుంటే సక్సెస్‌ రావట్లేదని అనుకున్నాడో ఏమో.. పేరు ముందు 'విజయ' చేర్చుకున్నాడు. పేరులో సక్సెస్‌ వచ్చేసింది కాబట్టి.. ఇక తన సినిమాల్లోనూ సక్సెస్‌లతో ఇరగదీసేస్తానని కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు సముద్ర.

అప్పట్లో సింహరాశి, శివరామరాజు లాంటి రీమేక్‌ సినిమాలతో సక్సెస్‌లు కొట్టి ఆ తర్వాత ఫేడవుట్‌ అయిపోయిన సముద్ర.. కొంత కాలంగా దారుణాతి దారుణమైన సినిమాలు తీస్తూ వస్తున్నాడు. తాజాగా తారకరత్నతో 'కాకతీయుడు' అనే సినిమా తీశాడు. ఎప్పుడో మొదలైన ఈ సినిమా మధ్యలో అతీగతీ లేకుండా పోయింది. ఇప్పుడు ఉన్నట్లుండి దాన్ని వార్తల్లోకి తెచ్చారు. పెద్దాయన దాసరి నారాయణరావు వచ్చి కాకతీయుడు టీజర్‌ రిలీజ్‌ చేశారు.

ఈ కార్యక్రమంలోనే సముద్ర ఉత్త సముద్ర కాదని.. విజయ సముద్ర అయ్యాడని జనాలకు తెలిసొచ్చింది. 'కాకతీయుడు'లో తారకరత్న రెండు విభిన్నమైన పాత్రలు చేస్తున్నాడని.. అందులో ఓ పాత్ర కోసం ఎనిమిది నెలలు కష్టపడ్డాడని చెబుతున్నాడు సముద్ర. బొబ్బిలిపులి సొసైటీకి ఓ సందేశాన్ని ఇచ్చి ఎంత పెద్ద సక్సెస్‌ అయిందో.. కాకతీయుడు కూడా అలాగే విజయవంతమవుతుందని చెప్పాడు సముద్ర. చూద్దాం ఏం జరుగుతుందో!