Begin typing your search above and press return to search.

నేను బతికేఉన్నాను.. దయచేసి దుష్ప్రచారం ఆపండి.. సినీనటి ఆవేదన

By:  Tupaki Desk   |   17 Sep 2020 2:30 PM GMT
నేను బతికేఉన్నాను.. దయచేసి దుష్ప్రచారం ఆపండి.. సినీనటి ఆవేదన
X
ఫేస్​బుక్​లో ఓ నటి జీవితాన్ని కుదిపేసింది. ఏకంగా ఆమె చనిపోయందని ప్రచారం జరుగడంతో ఆమె స్వయంగా ఫేస్​బుక్​ లైవ్​లోకి వచ్చి ‘నేను చనిపోలేదు బాబోయ్​.. ఇంకా బతికే ఉన్నాను. దయచేసి ఈ దుష్ప్రచారం ఆపండి’ అంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కరోనా మహమ్మారితో దేశవ్యాప్తంగా అనేక మంది వైద్యసిబ్బంది, వైద్యులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి అహ్మదాబాద్​కు చెందిన యువ గైనకాలజిస్ట్​ డాక్టర్​ విధి.. కరోనా మహమ్మారితో ప్రాణాలు కోల్పోయిందంటూ ఫేస్​బుక్​లో పోస్ట్​పెట్టారు. ఈ పోస్ట్​ సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. స్పందించిన నెటజన్లు ‘రిప్ విధి’ అంటూ కామెంట్లు పెట్టారు. ఈ ఫోటో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ​ కాగా ఈ విషయంపై యాంటీ ఫేక్​న్యూస్​ వార్​ రూమ్​ స్పందించింది. డాక్టర్​ విధి అనే డాక్టర్​ కరోనాతో చనిపోయిందో లేదో ఇప్పటివరకు తెలియదు కానీ ఫేస్​బుక్​లో వైరల్​ అవుతున్న ఫొటో మాత్రం డాక్టర్​ విధిది కాదు ఆ ఫోటోలో ఉన్నది దక్షిణాది సినీ నటి, మోడల్​ సంస్కృతి షేనాయ్​ అని వెల్లడించింది.

ఎవరీ సంస్కృతి
సంస్కృతి పలు తమిళ, మలయాళం, కన్నడ చిత్రాల్లో నటించింది.2015లో మలయాళం సినిమా అనార్కలి షూటింగ్‌ సందర్భంగా సంస్కృతి ఆ ఫోటో దిగిందని వాళ్ల ఎంక్వైరీలో తేలింది. సంస్కృతి తన ఫేస్‌బుక్‌ పేజీలో సెప్టెంబర్‌ 14న ఓ విడియో పెట్టింది. ‘డాక్టర్ విధి ఎవరో..! నాకు తెలియదు. ఆమె పేరిట వైరల్​ అవుతున్న ఫొటో మాత్రం నాది. నేను ఇంకా బతికే ఉన్నాను. ఎవరో తప్పుగా నా ఫోటోను వైరల్​ చేశారు’ అంటూ ఆమె ఫేస్​బుక్​లో వీడియో పోస్ట్​ చేశారు.


డాక్టర్​ విధి నిజంగానే చనిపోయారా..!

డాక్టర్​ విధిపేరుతో వైరల్​ అయిన ఫొటోలో ఉన్నది తానేనని సినీ నటి సంస్కృతి వెల్లడించడంతో ..డాక్టర్‌ విధి ఎవరూ అన్న విషయం ఆసక్తికరంగా మారింది. అయితే సెప్టెంబర్‌ 9న డాక్టర్‌ విధి పీపీఈ కిట్‌ ధరించి పేషంట్‌ను చెక్‌ చేస్తున్న ఫోటో ఒకటి ఇండియన్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ ఆర్గనైజేషన్‌(ఐఎంఎస్‌వో) తమ ఫేస్‌బుక్‌ పేజీలో షేర్‌ చేసింది. ఈ విషయమై యాంటీ ఫేక్‌వార్‌ రూమ్‌ ఐఎంఎస్‌వో సభ్యురాలు, డాక్టర్‌ విధి స్నేహితురాలు డాక్టర్‌ శుభమ్‌ కుమారిని కలిసింది. ఈ సందర్భంగా శుభమ్‌ కుమారి మాట్లాడుతూ.. ‘డాక్టర్​ విధి బిహార్​కు చెందిన వైద్య విద్యార్థిని.. ఆమెకు కరోనా సోకిన మాట వాస్తవమే. అయితే వైరల్​ అయిన ఫొటో మాత్రం ఆమెది కాదు. ప్రస్తుతం ఆ డాక్టర్​కు సంబంధించిన వివరాలు ఏవీ నాదగ్గర లేవు’ అని చెప్పారు కుమారి.