Begin typing your search above and press return to search.

రియల్ మ్యాన్: కుటుంబం కోసం కంసాలిగా మారిన హీరో

By:  Tupaki Desk   |   24 April 2020 10:50 AM GMT
రియల్ మ్యాన్: కుటుంబం కోసం కంసాలిగా మారిన హీరో
X
బర్నింగ్ స్టార్.. నిజంగానే బర్న్ అయిపోయాడు. తన చేతితో భార్యా పిల్లల కోసం అద్భుతమైన ఆభరణాలు తయారు చేసి ఇచ్చాడు. ఎంత ఎత్తుకు ఎదిగిన తన మూలాలు మరిచిపోలేదంటూ కంసాలిగా మారాడు.. హీరో సంపూర్ణేష్ బాబు లాక్ డౌన్ లో కంసాలిగా మారిన వైనం అందరినీ ఆకట్టుకుంది. సంపూ ‘రియల్ మ్యాన్’ అంటూ ఈ చాలెంజ్ కు అందరూ మద్దతు పలుకుతున్నారు.

హృదయ కాలేయం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన హీరో సంపూర్ణేష్ బాబు తనదైన కామెడీ సినిమాలతో హీరోగానే కాకుండా కమెడియన్ గా కూడా సినిమాల్లో కనిపిస్తున్నాడు. అయితే తనకొచ్చే సంపాదనలో దానధర్మాలు చేస్తూ పెద్ద హీరోలను మించిన మనసు తనది అని చాలా సార్లు చాటాడు. ఇప్పటికే ప్రకృతి విపత్తులకు, సినీ కార్మికు సీసీసీ చారిటీకి లక్ష రూపాయల విరాళంగా ఇచ్చాడు సంపూ.

ప్రస్తుతం లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లన్నీ ఆగిపోవడంతో సంపూర్ణేష్ బాబు తన సొంతూరు సిద్దిపేట వెళ్లిపోయాడు. కుటుంబంతో గడుపుతున్నాడు.

తాజాగా టాలీవుడ్ లో సాగుతున్న ‘బి ద రియల్ మ్యాన్ చాలెంజ్’లో సంపూర్ణేష్ పాల్గొన్నాడు. తన కంసాలి వృత్తిని గుర్తుచేసుకొని తన భార్య పిల్లల కోసం కాలిమెట్టెలు - పిల్లల కాళ్లకు గజ్జెలు స్వయంగా తయారు చేసి ఇచ్చాడు. ఈ మేరకు వీడియోను సంపూ ట్వీట్ చేశాడు.

సంపూ ట్వీట్ చేస్తూ ‘రాజు పేద తేడా లేదు... నీ ఆస్తి, డబ్బు నీ వెనక రావు.. నువ్వెక్కడి నుంచి వచ్చావో మర్చిపోకు అని నా నిజమైన స్థానం గుర్తు చేసుకుంటూ.. మా ఆవిడ కోసం, నా పాత "కంశాలి" వృత్తి ని గుర్తు చేసుకుంటూ ఇంట్లో మిగిలిన గజ్జెలతో, తనకి కాలి మెట్టెలు, పిల్లల కోసం గజ్జెలు చేయించి ఇచ్చాను’ అంటూ పేర్కొన్నారు. సంపూ ఇలా హీరో అని మరిచి తన వృత్తిని చేసుకోవడం .. నగలు తయారు చేసి ఇవ్వడం చూసి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. సంపూ రియల్ మ్యాన్ అంటూ కొనియాడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి