Begin typing your search above and press return to search.

బర్నింగ్ స్టార్ మండింది అందుకు కాదంట

By:  Tupaki Desk   |   27 May 2016 6:40 AM GMT
బర్నింగ్ స్టార్ మండింది అందుకు కాదంట
X
సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్లో టాలీవుడ్ కి పరిచయం చేసిన వాడు సంపూర్ణేష్ బాబు. బర్నింగ్ స్టార్ అంటూ ఆన్ లైన్ లో తెగ హంగామా చేసి.. తొలి సినిమా హృదయకాలేయంతో సక్సెస్ కొట్టేశాడు. కానీ ఇప్పుడదే సోషల్ మీడియాలో సంపూ పై వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది.

నాటా సెలబ్రేషన్స్ కు సంబంధించి.. సంపూర్ణేష్ బాబు ఫోటోను కమెడియన్ల గ్రూప్ లో చేర్చడంపై అలిగాడని, ఆ తర్వాత హీరోల మధ్యలో సంపూ ఫోటోను ఏర్పాటు చేసినా.. ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టేశాడని అనే టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సిల్లీ రీజన్స్ కి నాటా లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఏర్పాటు చేసిన ఈవెంట్ కి హాజరు కాకూడదని సంపూ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రచారం ఎక్కువైపోవడంతో.. అసలు విషయం చెప్పేందుకు సంపూర్ణేష్ ప్రయత్నిస్తున్నాడు.

'నాటా వాళ్లు ఇచ్చిన స్పాన్సర్ లెటర్ ఇన్ కంప్లీట్ గా ఉంది. అంతే కాదు.. సంపూ చెప్పిన ఇద్దరికి ఆ లెటర్ తో యూఎస్ వీసా వచ్చే ఛాన్స్ లేదు. అందుకే.. మరో లెటర్ ని పంపాల్సిందిగా సాన్సర్స్ ని కోరాం. అయినా.. వాళ్ల నుంచి రెస్పాన్స్ లేదు. అందుకే ఈ కార్యక్రమానికి సంపూర్ణేష్ అటెండ్ కావడంలేదు. మీడియాలో జరుగుతున్న ప్రచారం సరికాదు' అంటూ క్లారిటీ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు మేనజర్.