Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: రౌడీ వేర్ లుంగీలో సంపూ

By:  Tupaki Desk   |   22 Sept 2018 7:20 AM
ఫోటో స్టొరీ: రౌడీ వేర్ లుంగీలో సంపూ
X
విజయ్ దేవరకొండ క్లోతింగ్ బిజినెస్ లోకి రౌడీ వేర్ బ్రాండ్ తో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఫిల్మి ఈవెంట్లకు రౌడీ వేర్ డిజైన్ డ్రెస్ లలో హాజరవుతూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతుంటాడు. ఇక విజయ్ బ్లాక్ & వైట్ కలర్ లో ఉన్నఒక చెక్స్ లుంగీ ధరించి ఫిలిం ఫంక్షన్స్ కు అటెండ్ య్యాడు కూడా. లుంగీని చూసి కొంతమంది నోరెళ్ళబెడితే మరికొంతమంది విజయ్ గట్స్.. స్టైల్ స్టేట్మెంట్ కు ఫిదా అయ్యారు.

తాజాగా అలాంటి లుంగీనే బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు ధరించి 'కొబ్బరి మట్ట' ఈవెంట్ కు హాజరవడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇక విజయ్ దేవరకొండ తెలుపు రంగు చొక్కా వేసుకుంటే సంపూ మాత్రం నలుపు రంగులో దర్శనమిచ్చాడు. ఇక నెటిజన్స్ రెండూ ఫోటోలను పోలుస్తూ 'ఎక్స్ పెక్టేషన్ వెర్సస్ రియాలిటీ' అంటూ ఫన్నీ మీమ్ చేయడం..అది సోషల్ మీడియాలో వైరల్ కావడం వెంటనే జరిగాయి.

ఒక వీటిపై నెటిజనులు వారికి తోచిన కామెంట్లు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో హంగామా జరగడానికి ఇప్పుడు 'లుంగీ' కారణం అయింది... పోను పోను అంది గోచీగా మారుతుందేమో..!