Begin typing your search above and press return to search.

సంపూ సినిమాకు నిజంగా అంతిచ్చారా?

By:  Tupaki Desk   |   24 Jun 2016 11:47 AM GMT
సంపూ సినిమాకు నిజంగా అంతిచ్చారా?
X
తొలి సినిమా ‘హృదయ కాలేయం’ హిట్టయినా సరే.. సంపూర్ణేష్ బాబును చాలామంది కామెడీగానే ట్రీట్ చేస్తుండేవాళ్లు. అతణ్ని తక్కువగానే అంచనా వేసేవాళ్లు. కానీ మొన్న ‘కొబ్బరి మట్ట’ టీజర్ రిలీజయ్యాక పరిస్థితి మారిపోయింది. ఆ టీజర్లో సంపూ పలికిన లెంగ్తీ డైలాగ్ సోషల్ మీడియాలో.. యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమా మీద అంచనాల్ని పెంచింది. చిన్న సినిమాల్లో ఇదో పెద్ద సెన్సేషన్ కాగలదన్న అంచనాతో ఉన్నారు ఇండస్ట్రీ జనాలు. సంపూను ప్రస్తుతం కొంచెం సీరియస్ గానే ట్రీట్ చేస్తున్నారు జనాలు. ఆ ఒక్క టీజర్ తో ఈ సినిమాకు బంపర్ బిజినెస్ ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం.

‘కొబ్బరిమట్ట’ యుఎస్ థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ.30 లక్షలకు అమ్మినట్లుగా వార్తలొస్తున్నాయి. ‘కొబ్బరి మట్ట’ స్థాయి సినిమాకు ఇది చాలా చాలా పెద్ద మొత్తమే. నిజానికి కొందరు మీడియం రేంజి హీరోల సినిమాలు సైతం ఈ రేటే పలుకుతున్నాయి అమెరికాలో. నిజంగా ‘కొబ్బరి మట్ట’ అమెరికా హక్కుల్ని రూ.30 లక్షలకు అమ్మి ఉంటే ఇది చాలా పెద్ద డీల్ కిందే లెక్క. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు మంచి ఆఫర్లే వస్తున్నట్లు సమాచారం. రూ.5-6 కోట్ల మధ్య బిజినెస్ జరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఇదంతా ఆ టీజర్ పుణ్యమే అని చెప్పాలి. చిన్న సినిమానే అయినా.. ఎంత ప్రమోషన్ ద్వారా ఎంత హైప్ తీసుకురావచ్చో.. ‘కొబ్బరిమట్ట’ టీం రుజువు చేసింది. ఈ సినిమా హిట్టయితే సంపూ మరోసారి టాలీవుడ్లో హాట్ టాపిక్ అవడం ఖాయం.