Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్‌ అతగాడే పెద్ద థ్రెట్‌?!

By:  Tupaki Desk   |   26 July 2015 4:35 PM IST
అల్లరి నరేష్‌ అతగాడే పెద్ద థ్రెట్‌?!
X
హృదయ కాలేయం సినిమాతో సెన్సేషన్‌ అయ్యాడు సంపూర్ణేష్‌ బాబు. నైజాం నుంచి వచ్చిన స్టార్‌ కమెడియన్‌ గా పేరు తెచ్చుకున్నాడు. సెటైరికల్‌ కామెడీలతో ఓ రెండు ఎటెంప్ట్స్‌ చేసి ఫర్వాలేదనిపించాడు. హృదయకాలేయం, సింగం 123 ఫర్వాలేదన్న టాక్‌ తెచ్చుకున్నాయి. అయితే సేమ్‌ టైమ్‌ సంపూర్ణేష్‌ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్‌ చేసుకోవడానికి తెలివైన ఎంపికలు చేసుకునే పనిలో ఉన్నాడు. అయితే అతడి ఎదుగుదల అల్లరి నరేష్‌ కెరీర్‌ కి ఎర్త్‌ పెడుతుందా అన్న చర్చ ఫిలింనగర్‌ సర్కిల్స్‌ లో మొదలైంది.

నరేష్‌ ఇటీవలి కాలంలో వరుస పరాజయాలతో రేసులో వెనకబడ్డాడు. తండ్రి ఈవీవీ స్థాయిలో అద్భుతమైన కథల్ని తయారు చేసి కెరీర్‌ ని నిలబెట్టే దర్శకరచయితలు కరువవ్వడం వల్ల అతడి పరిస్థితి కాస్త ఇబ్బందికరంగానే తయారైంది. రాజేంద్ర ప్రసాద్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయి కామెడీ హీరో గా పేరు తెచ్చుకున్న నరేష్‌.. ఈ మధ్య బాక్సాఫీస్‌ వద్ద మ్యాజిక్‌ చేయలేకపోతున్నాడు. రొటీన్‌ స్ఫూఫ్‌ లు, పరమ రొటీన్‌ అప్పియరెన్స్‌ అతడిని పెద్ద దెబ్బ కొట్టాయనడంలో సందేహమే లేదు.

రవిబాబుతో కలిసి అతడు చేసిన ప్రయోగం 'లడ్డుబాబు' విజయం సాధించి ఉంటే అది అతడి ఫేట్‌ ని మార్చి ఉండేదే. నిన్నటి జేమ్స్‌ బాండ్‌ కూడా రొటీన్‌ సినిమాగానే పేరుతెచ్చుకుంది. ఏదేమైనా ఇప్పుడు నరేష్‌ స్థానంలో సంపూ దూసుకొస్తున్నాడన్న చర్చ ఆసక్తికరంగా మారింది. కానీ సంపూ కూడా రొటీన్‌ ఒరవడిలో, అదే మూసలో కొట్టుకుపోతే కొంత కాలమే ఆట సాగుతుంది. కాకపోతే నరేష్‌ కు ఒకరకమైన హ్యాండ్‌ సమ్‌ ఇమేజీ ఉంది. అదే సంపూలో మిస్సింగ్‌. కాబట్టి పూర్తిగా మన హృదయ కాలేయం బాబు థ్రెట్‌ అని చెప్పలేం.