Begin typing your search above and press return to search.

వరదబాధితులకు ఆర్థిక సాయం అందించి ఔదార్యం చాటుకున్న కమెడియన్

By:  Tupaki Desk   |   22 Oct 2020 2:20 PM IST
వరదబాధితులకు ఆర్థిక సాయం అందించి ఔదార్యం చాటుకున్న కమెడియన్
X
కొంతకాలంగా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ అతలాకుతలంగా అయ్యింది. ఇప్పటికీ పలు కాలనీ జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఇళ్లలోకి నీళ్లు వచ్చి ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. సీఎం కేసీఆర్​ పిలుపుమేరకు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. తాజాగా సినీ న‌టుడు సంపూర్ణేశ్​ బాబు 50వేల రూపాయ‌ల ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కి అంద‌జేశాడు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్​ రావుకు చెక్కును అందించి త‌న ఔదార్యాన్ని చాటుకున్నారు.

అకాల వర్షాల కార‌ణంగా హైదరాబాద్ ప్ర‌జ‌లు ఎంతో న‌ష్ట‌పోయార‌ని వారికి త‌న వంతు స‌హాయం అందించాన‌ని సంపూర్ణేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంపూర్ణేష్ బాబును అభినందించారు.సిద్దిపేట బిడ్డగా, సినీ ఆర్టిస్టుగా మానవత్వం చాటుకున్నారని ప్ర‌శంసించారు. వందల్లో కాలనీలు జలదిగ్బంధం కావడంతో ప్రజలు భయట అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. వరద బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద రూ. 550 కోట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, ఎన్‌టీఆర్‌, విజయ్‌ దేవరకొండ, ప్రభాస్ స‌హా ప‌లువురు ప్ర‌ముఖులు సీఎం రిలీఫ్ ఫండ్‌కి భారీ విరాళాన్ని ప్రకటించారు.