Begin typing your search above and press return to search.

సంపూ బాబూ.. ఏంటీ పైత్యం?

By:  Tupaki Desk   |   14 April 2015 9:00 AM GMT
సంపూ బాబూ.. ఏంటీ పైత్యం?
X
''నా దృష్టిలో కుటుంబం అంటే ఒక పాక.. భార్య అంటే నచ్చి తెచ్చుకునే తవుడు.. ఇక పిల్లలు.. మనం ఇష్టంతో కలుపుకున్న కుడితి.. కానీ నా దృష్టిలో తండ్రి అంటే పాలిచ్చే ఒక మగ ఆవు'... ఎలా అనిపిస్తోంది ఈ డైలాగ్‌. సన్నాఫ్‌ సత్యమూర్తికి పేరడీగా ఏదో సినిమా రాబోతోందని అనిపిస్తోంది కదా. ఇదంతా బర్నింగ్‌ స్టార్‌ సంపూర్ణేష్‌ బాబు కొత్త సినిమా 'కొబ్బరి మట్ట'కు సంబంధించి వేసిన ప్రోమో పోస్టర్‌ కోసం తయారు చేసిన డైలాగ్‌. ఏప్రిల్‌ 15న కొబ్బరిమట్ట తొలి పాట రిలీజ్‌ చేయబోతున్నారట. ఈ నేపథ్యంలో ఈ ప్రోమో పోస్టర్‌ రిలీజ్‌ చేశారు.

విశేషమేంటంటే.. ఏప్రిల్‌ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పాటను రిలీజ్‌ చేస్తున్నానని అంటున్నాడు సంపూ. స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 అని అందరికీ తెలుసు కానీ.. ఏప్రిల్‌ 15న స్వాతంత్య్రమేంటో అర్థం కాని విషయం. తెల్లదొరల పాలన నుంచి ఆ రోజు భారతీయులు విడుదలయ్యారని అంటున్నాడు సంపూ. బహుశా చరిత్రలో ఈ తేదీకి సంబంధించి ఏమైనా విశిష్టత ఉందో ఏంటో సంపూ బాబుకే తెలియాలి. కొబ్బరి మట్ట కోసం తాను గుండెలకు హత్తుకునే ఓ పాట పాడానని.. ఏప్రిల్‌ 15న భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ పాట విని ఆస్వాదించాలని పిలుపు ఇచ్చాడు సంపూ. గెట్‌ రెడీ.