Begin typing your search above and press return to search.

అబ్బే పెనాల్టీ ఏమీ లేదంట!!

By:  Tupaki Desk   |   31 July 2017 5:18 AM GMT
అబ్బే పెనాల్టీ ఏమీ లేదంట!!
X
'బిగ్ బాస్' షోలో అసలు ఏం జరుగుతుంది అనేది అందరికీ షాకే. ఎందుకంటే ఎప్పుడు ఏ కంటెస్టంట్ ఎలా ప్రవర్తిస్తాడో ఎవ్వరికీ అర్ధంకాదు. ముఖ్యంగా నటుడు సంపూర్ణేష్‌ బాబు ఎలియాస్ నర్సింహాచారి స్పందించిన తీరు అయితే షాకింగులకే షాకింగ్ అని చెప్పాలి. మనోడు ఆత్మహత్య చేసుకుంటాను అని బెదిరించి మరీ షో నుండి బయటకు వచ్చేశాడు.

ఈ సందర్బంగా వచ్చిన అతి పెద్ద న్యూస్ ఏంటంటే.. బిగ్ బాస్ కాంట్రాక్ట్ ఉల్లంఘించినందుకు ఇప్పుడు మనోడు ఏకంగా 16 లక్షల రూపాయలను చెల్లించాలని టాక్ వచ్చింది. అయితే ఇది ఎంతవరకు నిజం? దీని గురించి స్పందించిన సంపూ ఏమన్నాడంటే.. ''మనకో కష్టమొచ్చినప్పుడు, మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో...మీరే నా బిగ్ బాస్ అన్న గారు... ప్రేక్షక దేవుళ్ళకి క్షమాపణలు కోరుకుంటూ'' ముందుగా ఎన్టీఆర్ ను పొగిడేసి.. తరువాత ''ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్ బాస్ వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. పెనాల్టీ లాంటివి పుకార్లు మాత్రమే'' అని చెప్పాడు. తద్వారా పెనాల్టీలు గట్రా లేవని చెప్పకనే చెప్పాడు.

షో నుండి బయటకు వచ్చేసిన సంపూర్ణేష్‌ ఎన్టీఆర్ ను కలుసుకుని సారీ కూడా చెప్పాడట. అసలు పెనాల్టీ సంగతి అటుంచితే.. ఇప్పుడు సంపూర్ణేష్‌ లేకపోవడం వలన బిగ్ బాస్ కార్యక్రమంలో కాస్త గ్లో తగ్గింది అంటూ జనాలు కూడా రచ్చ చేస్తున్నారు. చూద్దాం ఏమవుతుందో.