Begin typing your search above and press return to search.

స్టార్ విలన్ మాట: త్రివిక్రమ్ అయితే కథ వినను

By:  Tupaki Desk   |   19 Feb 2017 1:02 PM GMT
స్టార్ విలన్ మాట: త్రివిక్రమ్ అయితే కథ వినను
X
సంపత్ రాజ్.. తమిళం నుంచి తెలుగులోకి వచ్చి విలన్ గా స్టార్ ఇమేజ్ సంపాదించిన నటుడు. ‘మిర్చి’తో బ్రేక్ అందుకుని.. ఎన్నో పెద్ద సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు సంపత్. ప్రస్తుతం తెలుగులో లీడింగ్ విలన్లలో ఒకడు సంపత్. అతడికి తమిళంలో వెంకట్ ప్రభు.. తెలుగులో త్రివిక్రమ్ శ్రీనివాస్ అత్యంత ఇష్టమైన దర్శకులట. అసలు కథ కానీ.. తన పాత్ర కానీ తెలియకుండా సినిమా ఓకే చేసే దర్శకులు ఈ ఇద్దరు మాత్రమే అంటున్నాడతను.

‘‘నేను కథ వినకుండా సినిమా చేసే దర్శకులు ఇద్దరే. ఇక్కడ త్రివిక్రమ్‌.. తమిళంలో వెంకట్‌ ప్రభు. వీరిద్దరి మీద నాకు చాలా గురి. త్రివిక్రమ్ దర్శకత్వంలో నేను ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా ఒక్కటే చేశాను. అయినా ఆయనంటే నాకు చాలా ఇష్టం. గౌరవం. త్రివిక్రమ్‌ సెట్‌ లో ఉంటే అక్కడంతా ఆనందం.. పాజిటివ్‌ వైబ్రేషన్స్ మాత్రమే ఉంటాయి. ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ సినిమాలో ఓ సన్నివేశానికి సంబంధించి.. ‘మీకెలా అనిపిస్తే అలా చెయ్యండి.. నేను చెప్పిందానికన్నా మీరే మంచి ఔట్ పుట్ ఇస్తున్నారు’ అని చెప్పి నాతో ఆ పాత్ర చేయించారు. అందులో నాది అంత ప్రాధాన్యమైన పాత్ర ఏమీ కాదు. ఐతే ఇంకో సినిమాలో నాకు పెద్ద పాత్ర ఇస్తానన్నారాయన. ‘మీరు నాకు మాటిచ్చారు. ఆ క్యారెక్టర్‌ ఇచ్చే వరకూ మీకు రకరకాల వీడియోలు.. మెసేజ్ లు పంపుతూనే’ ఉంటా అని ఆయనతో సరదాగా అంటూనే ఉంటా’’ అని సంపత్ తెలిపాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/