Begin typing your search above and press return to search.

మెమోరీస్‌ : రెండేళ్ల క్రితం గోవాలో

By:  Tupaki Desk   |   29 May 2021 8:00 AM IST
మెమోరీస్‌ : రెండేళ్ల క్రితం గోవాలో
X
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన ముద్దుగుమ్మ సమీరా రెడ్డి ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. హాయిగా జీవితాన్ని సాగిస్తున్న సమీరా రెడ్డి సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా పోస్ట్‌ లు పెడుతూ ఉంది. ఆ మద్య తన ప్రెగ్నెన్సీ వల్ల అందంను కోల్పోయాను. కొందరు దాన్ని ఏదో పెద్ద విషయంగా విమర్శిస్తూ ఉన్నారుంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత తనలో వస్తున్న మార్పుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు ఈ అమ్మడు మళ్లీ మునుపటి రూపంతో అంటే అందంగా తయారు అయ్యింది.

పిల్లలు పెద్ద వారు అవుతున్న ఈ సమయంలో ఆమె మళ్లీ సినిమా ల్లో నటించేందుకు సిద్దం అవుతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఆమె సినిమాల విషయం ఏమో కాని తాజాగా ఆమె పాత మెమోరీస్ ను గుర్తుకు తెచ్చుకుంది. సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజున అంటూ తన సెకండ్‌ ప్రెగ్నెన్సీ ఫొటో లను షేర్‌ చేసింది. అప్పుడు గోవాకు వెళ్లినట్లుగా ఆమె పేర్కొంది. గోవాలో కొన్ని రోజులు ప్రశాంతంగా గడిపినట్లుగా ఆమె పేర్కొంది. రెండేళ్ల తర్వాత చాలా మార్పు వచ్చిందని కూడా ఆమె పేర్కొంది.

ఇలా బేబీ బంప్‌ తో ఫొటోలను షేర్‌ చేయడం ఈమద్య కాలంలో కామన్ అయ్యింది. నెటిజన్స్‌ ఈమె కొత్త ఫొటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు. కొన్ని గంటల వ్యధిలో దాదాపుగా లక్ష మంది వరకు లైక్స్‌ చేశారు. మొత్తంగా సమీరా రెడ్డి మెమోరీస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.