Begin typing your search above and press return to search.

రీఎంట్రీకి ఆ హాట్ హీరోయిన్ తహతహ

By:  Tupaki Desk   |   14 March 2017 8:44 AM GMT
రీఎంట్రీకి ఆ హాట్ హీరోయిన్ తహతహ
X
హీరోయిన్ కలలు కనే వారిలో చాలామంది కలలు తీరవు. కొంతమంది కలలు తీరినా.. వారు అనుకున్న స్థాయికి చేరుకునే వారు చాలా తక్కువ మందే. అలాంటి కోవలోకే వస్తారు హాట్ హీరోయిన్ గా పేరున్న సమీరారెడ్డి. పేరుకు తెలుగు అమ్మాయే అయినా.. తనను తాను అలా చెప్పుకోవటానికి పెద్దగా ఇష్టపడని ఆమె.. తెర మీద తన ప్రతాపాన్ని ఓ రేంజ్లో చూపించారు.అయినప్పటికీ.. ఆశించినంత ఫలితం ఆమెకు సొంతం కాలేదు.

స్కిన్ షోలో బాలీవుడ్ భామలతో పోటీ పడినా..ఆమెకు లభించిన పాత్రలు అంతంత మాత్రమే. పేరు ప్రఖ్యాతులు కూడా అంతంత మాత్రమే. తెలుగుతో పోలిస్తే.. తమిళం మీద ఎక్కువ ఫోకస్ చేసిన సమీరా 2014లో మ్యారేజ్ చేసుకొని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం ఒక బిడ్డకు తల్లి అయిన సమీరా.. రీఎంట్రీ ఇచ్చే అవకాశం లేదన్న మాట పలువురి నోటి నుంచి వినిపించింది.

తాజాగా అందుకు భిన్నమైన వార్త ఒకటి సినీ పరిశ్రమలో వినిపిస్తోంది.తన రీఎంట్రీ కోసం తన పాత పరిచయాలకు పని చెబుతున్న ఆమె.. సపోర్టింగ్ క్యారెక్టర్లు ఇచ్చినా ఫర్లేదని చెబుతుందట. చాలామంది పెళ్లి అయిన హీరోయిన్ల మాదిరే.. మంచి సపోర్టింగ్ క్యారెక్టర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. నిన్నటి వరకూ హాట్ హాట్ అందాలతో వెండితెరకు వెలుగులు అద్దిన సమీరా.. ఇప్పుడు అందుకు భిన్నంగా సపోర్ట్ క్యారెక్టర్లు వేస్తే జనాలు చూసే అవకాశం ఉందా? అన్న డౌట్ వ్యక్తమవుతున్నా.. ఛాన్స్ వస్తే మాత్రం తన సత్తా చూపిస్తానంటోందీ ఆంటీ. మరి.. సమీరాకు రీఎంట్రీ అవకాశం ఇచ్చేదెవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/