Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్...!

By:  Tupaki Desk   |   21 April 2020 1:20 PM IST
లాక్ డౌన్ సమయంలో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న ఎన్టీఆర్ హీరోయిన్...!
X
ఎన్టీఆర్ నటించిన 'నరసింహుడు' సినిమాతో టాలీవుడ్‌కు పరియయమైన హీరోయిన్ సమీరారెడ్డి. రాజమండ్రికి చిందిన సమీరా రెడ్డి తండ్రి బిజినెస్ మెన్ కావడంతో ముంబైలో పెరిగింది. ఈ తర్వాత చిరంజీవితో కలిసి ‘జై చిరంజీవ’.. సూర్యతో కలిసి ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్'.. ఎన్టీఆర్ 'అశోక్' సినిమాల్లో నటించింది. అందులో 'జై చిరంజీవ' సినిమా మినహా ఏ సినిమా హిట్ కాలేదు. అయితే హిందీ తమిళం లో మంచి విజయాలు సొంతం చేసుకుంది. 2002 నుంచి 2013 వరకు సినిమాలు చేసిన సమీరా ఆ తరువాత సినిమాలకు దూరం అయ్యింది. చివరిగా ‘వరదనాయక’ అనే కన్నడ సినిమాలో నటించిన సమీరా తెలుగులో చివరిగా 'కృష్ణం వందే జగద్గురుమ్'లో మెరిసింది. ఆ తర్వాత రెండేళ్లుగా ప్రేమిస్తున్న ముంబయికి చెందిన వ్యాపారవేత్త అక్షయ్ వర్దేను వివాహం చేసుకున్నారు. దాంతో పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. సమీరాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టీవ్ గా ఉండే సమీరా తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉంటారు. గర్భధారణ సమయంలో.. ప్రసవానంతరం ఎదుర్కొన్న శరీరాకృతి సమస్యలు.. మహిళలు స్వతంత్రంగా గౌరవంగా జీవించాలంటూ అనేక అంశాలను అభిమానులతో షేర్ చేసుకుంది.

ఇప్పుడు లాక్ డౌన్ సమయంలో తన కుటుంబంతో ముంబై లో కలిసి ఎంజాయ్ చేస్తోంది సమీరారెడ్డి. ముఖ్యంగా తన పిల్లలు హన్స్ మరియు నైరా లతో కాలక్షేపం చేస్తోంది. తన పిల్లలతో కలిసి డాన్స్ చేస్తూ.. సాంగ్స్ పడుతూ వాటిని వీడియోస్ రూపంలో బందిస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోంది. సమీరా ప్రతిరోజు పిల్లలతో అట్లాడిస్తూ వారికి కొత్త కొత్త గేమ్స్ పరిచయం చేస్తూ.. వారికి ఈ క్వారంటైన్ లో కొత్త విషయాలను నేర్పిస్తూ.. వీలైనంతగా వారిని నవ్విస్తూ ఎంజాయ్ చేస్తోందట. మొత్తానికి ఈ లాక్ డౌన్ సమయాన్ని చాలా బాగా వాడుకుంటుందట. ఇక సమీరా పెళ్లి విషయానికొస్తే సినిమాటిక్ గా జరిగిందని చెప్పవచ్చు. స్వతహాగా బైక్స్ అంటే ఇష్టపడే సమీరా బైక్ బిజినెస్ చేసే అక్షయ్ వర్దేని బైక్ రైడింగ్ తో కలిసింది. వీరిద్దరికి బైక్స్ మీద ఉన్న ప్యాషన్ వీరిని ఒకటిగా చేసింది. రెండేళ్ల ప్రేమాయణం తర్వాత వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.