Begin typing your search above and press return to search.

కూతురు పుట్టింది.. హీరోయిన్ గుడ్ న్యూస్

By:  Tupaki Desk   |   12 July 2019 3:38 PM IST
కూతురు పుట్టింది.. హీరోయిన్ గుడ్ న్యూస్
X
అందాల క‌థానాయిక స‌మీరా రెడ్డి రెండో బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌న సంతోషాన్ని సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. త‌న అర‌చేతిలో ఇమిడిపోయిన‌ క్యూట్ కిడ్ చేతి వేళ్ల‌ను ఫోటోలు తీసి వాటిని అభిమానుల‌కు షేర్ చేసారు. ``నేటి ఉద‌య‌మే లిటిల్ యాంజెల్ జ‌న్మించింది. మీ ప్రేమ‌.. ఆశీస్సుల‌కు ధ‌న్య‌వాదాలు`` అని స‌మీరా సంతోషం వ్య‌క్తం చేశారు. నిన్న రాత్రి ముంబై ఖ‌ర్ ఆస్ప‌త్రిలో చేరిన స‌మీరా నేటి ఉద‌య‌మే ఆడ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. స‌మీరా రెడ్డి- అక్ష‌య్ వార్దే జంట ప్ర‌స్తుతం ఈ ఆనందాన్ని కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు.

ఇటీవ‌లే అండ‌ర్ వాట‌ర్ బేబి బంప్ ఫోటో షూట్ తో స‌మీరా రెడ్డి స‌డెన్ గా చ‌ర్చ‌ల్లోకొచ్చారు. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియాలో.. టీవీ చానెళ్ల‌లో డిబేట్ల గురించి తెలిసిందే. 2014లో బిజినెస్ మేన్ అక్ష‌య్ వార్ధేని పెళ్లాడాక‌ సినిమాలు వదిలేసి పూర్తిగా వ్య‌క్తిగ‌త జీవితానికే అంకిత‌మైన స‌మీరారెడ్డి 2015లో మ‌గ‌ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. ఈసారి ఆడ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు.

మొద‌టి సారి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన‌ప్పుడు త‌న శ‌రీరంలో వ‌చ్చిన మార్పులు చూసి త‌న‌పై ర‌క‌ర‌కాల కామెంట్లు వినిపించాయ‌ని ఇటీవ‌లే ఓ ఇంట‌ర్వ్యూలో స‌మీరా రెడ్డి వెల్ల‌డించారు. ఫ్రెగ్నెన్సీ వ‌ల్ల స‌మ‌స్య‌లొచ్చాయి. హార్మోన్స్ లో అనూహ్య మార్పొచ్చింది. 102 కేజీల బ‌రువు పెరిగాను. అస‌లు ఇది స‌మీరాయేనా? అని ప్ర‌శ్నించారు కొంద‌రైతే. ఇలాంటి సెన్సిటివ్ విష‌యాల్ని జ‌నం ఇలా మాట్లాడ‌తార‌ని నాకు తెలీదు.. అంటూ స‌మీరా అప్ప‌టి అనుభ‌వాల్ని ఆ ఇంట‌ర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. త‌న‌ని విమ‌ర్శించిన ప్ర‌తిసారీ బాత్రూమ్ లోకి వెళ్లి ఏడ్చేదానిన‌ని అయితే ఆ విష‌యాలేవీ త‌న భ‌ర్త‌కు తెలియ‌వ‌ని స‌మీరా టాప్ సీక్రెట్ ని రివీల్ చేశారు.