Begin typing your search above and press return to search.

ఎఫైర్ ఉందంటూ సీరియల్ నుంచి తీసేశారు!

By:  Tupaki Desk   |   18 Feb 2022 9:38 AM GMT
ఎఫైర్ ఉందంటూ సీరియల్ నుంచి తీసేశారు!
X
సమీర్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ. చాలా సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వెళుతున్నాడు. సినిమాల్లోకి రావడానికి ముందు ఆయన టీవీ సీరియల్స్ లో ఎక్కువగా కనిపించాడు. బుల్లితెరపై అప్పట్లో కనిపించిన హ్యాండ్సమ్ హీరో సమీర్ అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అందువలన అప్పట్లో ఆయన వరుస సీరియల్స్ చేస్తూ చాలా బిజీగా ఉండేవాడు. ఎక్కువగా ఒక ప్రైవేట్ ఛానల్ నిర్మించే సీరియల్స్ లో ఆయన వరుసగా చేస్తుండేవాడు. ఆ ఛానల్ లో ప్రసారమైన కొన్ని సీరియల్స్ హిట్ కావడం కూడా ఆయనకి కలిసొచ్చింది.

అయితే అదే ఛానల్ వారు .. తనపై చెప్పుడు మాటలు నమ్మి తనని తొలగించారని ఒక యూ ట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సమీర్ చెప్పాడు. ఈ విషయాన్ని గురించి సమీర్ మాట్లాడుతూ .. అది బాగా పాప్యులర్ అయిన సీరియల్. అందులో నేను హీరోగా చేస్తున్నాను. అప్పటికే చాలా ఎపిసోడ్స్ జనంలోకి వెళ్లిపోయాయి. ఆ సీరియల్ హీరోయిన్ తో నేను ఎఫైర్ పెట్టుకున్నానని గిట్టనివాళ్లు కొంతమంది ప్రచారం చేశారు. సెట్ లోనే రాసలీలలు కొనసాగిస్తున్నాడంటూ ఛానల్ యాజమాన్యానికి నాపై ఫిర్యాదు చేశారు.

ఛానల్ వారు నన్ను పిలిపించి ఏం జరిగిందని కనుక్కుంటే బాగుండేది .. నేను చెప్పడానికి ప్రయత్నించినప్పుడు వినడానికి అవకాశం ఇచ్చినా బాగుండేది .. కానీ అలా జరగలేదు. కానీ ఛానల్ వారు నా వైపు నుంచి ఎలాంటి సమాధానం అడగలేదు.

ఎవరైతే నా గురించి అలా చెప్పారో అదే నిజమని నమ్మారు. ఆ సీరియల్ నుంచి నన్ను ఉన్నపళంగా తీసేయడమే కాకుండా నాపై బ్యాన్ పెట్టారు. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనతో నేను అయోమయంలో పడిపోయాను. ఆ సమయంలో ఏం చేయాలో కూడా నాకు తోచలేదు. ఇంటి అద్దె .. ఇన్ స్టాల్ మెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడ్డాను.

ఆ రోజులను నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఆ తరువాత కొంతకాలానికి ఆ ఛానల్ వారు నాకు కాల్ చేశారు. నాపై వచ్చిన ఆరోపణలలో నిజం లేదనే విషయం తమ దృష్టికి వచ్చిందని అంటూ సారీ చెప్పారు. కానీ అప్పటికే కెరియర్ పరంగా నాకు జరగవలసిన నష్టం జరిగిపోయింది.

నా మనసు విరిగిపోయింది. అందువలన నేను సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెడుతూ ముందుకు వెళ్లాను. సినిమాల్లోకి రావడం వలన నా పరిచయాలు .. పరిధి పెరిగాయి. వెండితెరపై కూడా నాకు మంచి గుర్తింపు లభించింది. ఏది జరిగినా మన మంచికే అని ఎందుకు అంటారనేది నాకు అర్థమైంది" అని చెప్పుకొచ్చాడు.