Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ దెబ్బతో భలే ఛాన్సొచ్చిందిగా

By:  Tupaki Desk   |   8 March 2018 2:30 AM GMT
బిగ్ బాస్ దెబ్బతో భలే ఛాన్సొచ్చిందిగా
X

సీరియల్స్ లో నటించే వారు ఎక్కువగా సినిమాల్లో కనిపించరు. ఎవరో కొందరు మాత్రమే అప్పుడపుడు సినిమాల్లో కనిపిస్తుంటారు. రోజు సీరియల్స్ తోనే వారి కాలం నడుస్తుంది. ఆ సైడ్ నుంచి వచ్చిన వారిలో హరి తేజ అనే నటి కూడా ఉంది. మొదట సీరియల్స్ ద్వారా నటిగా పరిచయమైన హరితేజ సినిమాల్లో అవకాశాలను ఎక్కువగా దక్కించుకోలేదు. ఎప్పుడైతే అఆ సినిమాలో కనిపించిందో కొంచెం పేరొచ్చింది. ఇక ఆ పేరుకు బిగ్ బాస్ కొంచెం బూస్ట్ ఇవ్వడంతో అమ్మడి క్రేజ్ కొంచెం పెరిగింది. దీంతో యాంకర్ పోస్ట్ కి షిఫ్ట్ అయ్యింది.

అలాగే క్యారక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కూడా ఆ మధ్య సినిమాలు తగ్గించేశాడు అనుకుంటున్న సమయంలో మళ్లీ బిగ్ బాస్ కారణంగా బిజీ అయ్యాడు. మొదటి సీజన్ లో వీరికి మంచి గుర్తింపు దక్కడంతో ఇప్పుడు షోలకు జోడిగా సెట్ అయ్యారు. సొగసు చూడతరమా అనే షోకి ఇద్దరు వ్యాఖ్యాతలుగా వ్యవహరించబోతున్నారు. త్వరలోనే ఆ షో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే హరితేజ ఓ షోని లీడ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో మరో ఛాన్స్ కొట్టేసింది. మొత్తంగా బిగ్ బాస్ దెబ్బకు వీరికి మంచి ఛాన్స్ దక్కిందని అందరు అనుకుంటున్నారు.

ఇక బిగ్ బాస్ రెండవ సీజన్ కోసం స్టార్ మా నిర్వాహకులు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ సారి చాలా మంది నటీనటులు బిగ్ బాస్ లో కనిపించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. రికమండేషన్స్ కూడా నడుస్తున్నాయట. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు అడుగుపెడతారో చూడాలి. అన్నింటికంటే ముందు.. అసలు బిగ్ బాస్ ను నాని హోస్ట్ చేస్తాడా? బన్నీ నడిపిస్తాడా? లేదంటే నాగార్జున మళ్ళీ కొట్టేస్తాడా? అనే విషయం కూడా తెలియాల్సి ఉంది.