Begin typing your search above and press return to search.

‘ఎఫ్‌ 3’ రిలీజ్ కు అదే సెంటిమెంట్ ?

By:  Tupaki Desk   |   28 April 2021 10:53 AM GMT
‘ఎఫ్‌ 3’ రిలీజ్ కు అదే సెంటిమెంట్ ?
X
సినిమావాళ్లకు సెంటిమెంట్స్ ఎక్కువ. కోట్లతో నడిచే వ్యాపారం కాబట్టి ఎవరి భయాలు వాళ్లకు ఉంటాయి. దాంతో రకరకాల సెంటిమెంట్స్ వచ్చి చేరతాయి. కొందరు టైటిల్స్ విషయంలో సెంటిమెంట్ కు వెళ్తే మరికొందరు రిలీజ్ డేట్ విషయంలో సెంటిమెంట్ చూపిస్తారు. ఇప్పుడు అనీల్ రావిపూడి కూడా తన తాజా చిత్రం ఎఫ్ 3 విషయంలో అదే సెంటిమెంట్ ని ఫాలో అవుతున్నాడని వినపడుతోంది.

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘ఎఫ్‌ 3’. అనిల్‌ రావిపూడి దర్శకుడు. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్స్. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అనుకున్న సమయంలో ఏప్రియల్ 13న అనీల్ రావిపూడి కోవిడ్ బారిన పడ్డారు. దాంతో ఐసోలేషన్ కు వెళ్ళారు. ఇప్పుడు ఆయనకు నెగిటివ్ వచ్చిందని అఫీషియల్ గా ప్రకటించారు. అలాగని ఇప్పటికిప్పుడు షూటింగ్ ప్రారంభించే పరిస్దితి లేదు. కరోనా కాస్త కంట్రోలులోకి వచ్చాక ప్రారంభించినా రిలీజ్ డేట్స్ దొరికేటట్లు కనపడటం లేదు. దాంతో ఈ సినిమాని తన సెంటిమెంట్ అయిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

2019 సంక్రాంతికు వచ్చిన తన ఎఫ్ 2 చిత్రం కలెక్షన్స్ పరంగా ఓ ఊపు ఊపేసింది భారీ కమర్షియల్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సరిలేరు నీకెవ్వరూ అంటూ మహేష్ తో చేసిన చిత్రం కూడా సంక్రాంతికి విడుదల అయి.. సక్సెస్ అయ్యింది. దాంతో ఎఫ్ 3 కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తే నిర్ణయం నిర్మాత దగ్గర వ్యక్తం చేసినట్లు సమాచారం. వాస్తవానికి ఆగస్టు 27న ఈ చిత్రం విడుదల ప్లాన్ చేసారు. కానీ ఇప్పుడున్న సిట్యువేషన్ లో ఆగస్టులో వరస సినిమా రిలీజ్ లు ఉండటం తో థియోటర్స్ ఎడ్జెస్ట్ చేయటం చాలా కష్టం.

ఇక ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.అనిల్‌ రావిపూడి-వెంకటేశ్‌-వరుణ్‌ కలయికలో గతంలో వచ్చిన ‘ఎఫ్‌ 2’కి సీక్వెల్‌గా రూపొందుతుందీ ‘ఎఫ్‌ 3’. ఎఫ్‌ 2 మంచి సక్సెస్ అందుకోవడంతో ఎఫ్‌ 3పై ఎక్సపెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఎఫ్3లో సినిమా కథ డబ్బు సంపాదన చుట్టూ తిరుగుతుందట. సునీల్ పాత్ర ప్రత్యేక ఆకర్షణ అవుతుందని చెప్తున్నారు.