Begin typing your search above and press return to search.

అప్పుడు పక్కన పెట్టిన స్క్రిప్ట్ తోనే ఇప్పుడు సినిమా

By:  Tupaki Desk   |   13 Dec 2019 7:10 AM GMT
అప్పుడు పక్కన పెట్టిన స్క్రిప్ట్ తోనే ఇప్పుడు సినిమా
X
ఇది ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ఒక స్టార్ హీరో సినిమా.. త్వరలోనే విడుదల కు సిద్దమవుతోంది. ఈ సినిమాపై ఇటు ప్రేక్షకుల్లో అటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు కూడా ఉన్నాయి. మేకర్స్ కూడా ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నమ్మకంగా చెప్తున్నారు. ఇదిలా ఈ కథ గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాక్ వినిపిస్తోంది.

ఇది నిజానికి కొత్తగా దర్శకుడు రాసుకున్న కథ కాదట. ఇతను కొన్నేళ్ళ క్రితం ఒక స్టార్ డైరెక్టర్ దగ్గర రైటింగ్ డిపార్ట్ మెంట్ లో పని చేస్తున్నప్పుడు ఇదే స్టార్ హీరో కోసం రాసిన కథ అని సమాచారం. అయితే కొన్ని కారణాల వల్ల ఆ డైరెక్టర్ ఈ కథను పక్కన పెట్టేసి వేరే కథ తో సినిమా ను తెరకెక్కించాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్ గా నిలిచింది. సీన్ కట్ చేస్తే.. ఆ పక్కన పెట్టిన కథ ను ఇప్పుడు కొన్ని మార్పులు చేసి సినిమా ను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ త్వరగా పూర్తి కావడానికి అదే కారణమట. అప్పుడు పక్కన పెట్టిన స్క్రిప్ట్ ను అదే స్టార్ హీరో ఇప్పుడు ఇలా ఒప్పుకున్నాడు అనేది మాత్రం తెలియదు. మరి ఈ సినిమా ఈ దర్శకుడికి-స్టార్ హీరోకి భారీ విజయాన్ని అందిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.