Begin typing your search above and press return to search.

రెండు సీక్వెల్స్ లోను ఒకటే క్లైమాక్స్

By:  Tupaki Desk   |   17 March 2017 5:53 AM GMT
రెండు సీక్వెల్స్ లోను ఒకటే క్లైమాక్స్
X
దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్న సీక్వెల్స్.. బాహుబలి: ది కంక్లూజన్.. రోబో 2.0. బాహుబలి పార్ట్ 2 చిత్రానికి.. ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ కాగా.. రజినీ 2.0 మాత్రం ఇంకా ఫస్ట్ లుక్స్ దగ్గరే ఆగిపోయింది. అయితే.. బాహుబలి2 ఏప్రిల్ 28న విడుదల కానుండగా.. శంకర్ తీస్తున్న రోబో పార్ట్2 ఈ ఏడాది దీపావళికి షెడ్యూల్ చేశారు.

తాజాగా రిలీజ్ అయిన బాహుబలి ది కంక్లూజన్ ట్రైలర్ చూసిన ఆడియన్స్.. 2.0తో ఉన్న కొన్ని పోలికలను పాయింట్ చేసి చూపుతున్నారు. ముఖ్యంగా బాహుబలి యుద్ధాలు అన్నిటిలోకి బాస్ లా ఉంటుందని భావిస్తున్న మహేంద్ర బాహుబలి-భల్లాలదేవుడు మధ్య ఫైట్ లో భాగంగా.. రౌద్రంగా చూస్తున్న ఇద్దరినీ ఒకే స్క్రీన్ పై చూపడంతో ఆ ట్రైలర్ కంప్లీట్ అవుతుంది. కానీ 2.0 చిత్రం కోసం ఇచ్చిన పోస్టర్లలో ఇప్పటికే రజినీకాంత్.. అక్షయ్ కుమార్ లను ఎదురెదురుగా ఇలాగే చూపుతూ పోస్టర్ వేశారు.

ఒకే ఫ్రేమ్ లో చూసినపుడు.. ఎడమవైపు హీరో.. కుడివైపున విలన్.. ఒకరినొకరు సీరియస్ గా చూసుకోవడం గమనిస్తే.. యాక్టర్లు వేరు పోస్టర్లలో పోజులు ఒకటే అనిపించక మానదు. అఫ్ కోర్స్.. ఏ సినిమా క్లైమాక్స్ అయినా.. హీరో విలన్ ల మధ్య పోరాటంతో ముగియాల్సిందే. కానీ దాన్నే ప్రధానంగా చూపడం ఒకటే కొంత ఆశ్చర్యం కలిగించే విషయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/