Begin typing your search above and press return to search.

'సాహో'కి 'సైరా'కి ఒకే బడ్జెట్

By:  Tupaki Desk   |   23 Sep 2019 5:30 PM GMT
సాహోకి సైరాకి ఒకే బడ్జెట్
X
బాహుబలితో ఎప్పుడైతే తెలుగు సినిమా మార్కెట్ పెరిగిందో అప్పటి నుండి మేకర్స్ భారీ బడ్జెట్ కి వెనకడుగు వేయట్లేదు. సాహో కి ముందు 200 కోట్ల అనుకోని ఆ తర్వాత అదనంగా మరో వంద కోట్లు పెంచారు. సినిమాలో ఎనిమిది నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ కి ఏకంగా 70 కోట్లు ఖర్చు పెట్టారు. అంత ఖర్చు పెట్టి అబుదాబీలో తెరకెక్కించినందువల్ల ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలో స్పెషల్ హైలైట్ గా నిలిచింది.

అయితే ఇప్పుడు సైరా విషయంలోనూ అదే జరగబోతుంది. సినిమాలో ఓ వార్ సీక్వెన్స్ కోసం సరిగ్గా సాహో యాక్షన్ ఎపిసోడ్ కి ఖర్చు పెట్టినట్టే 70 కోట్లు పెట్టారట. ఈ విషయాన్నీ చిరు స్వయంగా చెప్పడం. సినిమా గొప్పగా తీర్చి దిద్దడం కోసం చరణ్ ఎక్కడ రాజీ పడలేదు అంటూ జార్జియా లో 3000 మందితో తీసిన ఎపిసోడ్ కోసం 70 కోట్లు ఖర్చు పెట్టాడని తెలిపాడు.

అంటే సాహో అబుదాబీ ఎపిసోడ్ కి ఎంతయ్యిందో సరిగ్గా సైరా జార్జియా వార్ ఎపిసోడ్ కోసం అంత అయింది. ఈ వార్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అంటూ మెగా కాంపౌండ్ నుండి టాక్ వస్తుంది. ఆ యాక్షన్ ఎపిసోడ్ లో మెగా స్టార్ మరీ రెచ్చిపోయి నటించారని కూడా వినిపిస్తుంది. మరి సాహో లాగే సైరా లో కూడా 70 కోట్ల ఎపిసోడ్ హైలైట్ గా నిలుస్తుందేమో చూడాలి.