Begin typing your search above and press return to search.

వీడియో: జిమ్ లో క‌ఠోర‌ధీక్ష .. షాకిస్తున్న అక్కినేని కోడలు!

By:  Tupaki Desk   |   23 Oct 2020 4:20 PM IST
వీడియో: జిమ్ లో క‌ఠోర‌ధీక్ష .. షాకిస్తున్న అక్కినేని కోడలు!
X
సమంతా అక్కినేని తాజా కఠిన వ్యాయామం వీడియో అంత‌ర్జాలంలో హీట్ పుట్టిస్తోంది. సామ్ సోష‌ల్ మీడియాల్లో రిలీజ్ చేసిన నిమిషాల్లోనే ఈ వీడియో జోరుగా వైర‌ల్ అయిపోతోంది. నిరంత‌రం ఈ భామ‌ ఫ్యాషన్ ఎంపికలతో పాటు ఫిట్నెస్.. ఆరోగ్యం .. ఆహారం గురించి చాలా అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల్ని చేస్తున్న సంగ‌తి తెలిసిన‌దే. జిమ్ త‌ర‌గతుల్ని నిర్వ‌హిస్తోంది ఈ త‌రహా స్ఫూర్తి నింపే వీడియోల‌తో.

క్ష‌ణం తీరిగ్గా ఉండ‌డానికి ఇష్ట‌ప‌డ‌ని త‌త్వం సామ్ ది. అందుకే నిరంత‌రం ఏదో ఒక త‌ప‌న‌తో జీవిస్తోంది. ఈ లాక్ డౌన్ సమయంలో సామ్ వంట ప‌ని.. రూఫ్ టాప్ పై తోటపనిపై అవ‌గాహ‌న పెంచుతూ చేసిన వీడియో వైర‌ల్ అయ్యింది. త‌దుప‌రి సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించలేదు కాబ‌ట్టి.. సమంతా అక్కినేని తన ఫిట్ నెస్ ‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. తనను తాను ఆకృతిలో ది బెస్ట్ గా ఆవిష్క‌రించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తోంద‌ట‌. ఇటీవల తన కఠినమైన వ్యాయామ సెషన్ల కొన్ని వీడియోలను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంది.

తాజా వీడియో చూస్తుంటే.. సామ్ తన ఇంటి వ‌ద్ద‌నే వ్యాయామశాలలో శ్ర‌మిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. సామ్ వీడియో ప్రధాన ఫిట్‌నెస్ లక్ష్యాలను యువ‌త‌రానికి నిర్దేశిస్తోంది. మిడ్-వీక్ ఫిట్నెస్ స్ఫూర్తి కోసం మీకు ఇది అవసరం! లాక్డౌన్ సమయంలో యోగా.. పైలేట్స్ .. ఇతర వివిధ విషయాలలో ఫిట్ గా ఉండటానికి సామ్ తన వంతు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇత‌రుల‌ను ఇలా ప్ర‌య‌త్నించ‌మ‌ని చెబుతోంది.

సామ్ ఇంత‌కుముందు ఇషా క్రియ పేరుతో 48 రోజులు ప్ర‌త్యేక సాధ‌న‌ చేసింది. దాని గురించి చెబుతూ.., ``ఈ రోజు నేను నా 48 రోజుల ఇషా క్రియా ప్రయాణాన్ని ప్రారంభించాను .. నాతో చేరాలని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను ... ఇషా క్రియా ఆరోగ్య శ్రేయస్సును ఇస్తుంది. ఇది శక్తివంతమైనది. క‌ష్టాన్ని భరించటానికి సాధనం .. పూర్తి సామర్థ్యంతో జీవితాన్ని గడపడానికి నిర్ధేశించిన‌ది.. ఇది ఉచిత గైడెడ్ ధ్యానం .. నేను మీకు శాంతి ద‌క్కాల‌ని కోరుకుంటున్నాను`` అని వ్యాఖ్యానించింది.

కెరీర్ సంగ‌తి చూస్తే.., సామ్ తదుపరి విజయ్ సేతుపతితో క‌లిసి విఘ్నేష్ శివన్ `కాతు వాకులా రేండు కదల్ ` లో న‌టించ‌నుంది. ఈ చిత్రంలో నయనతార ఒక‌ కథానాయికగా నటిస్తోంది. త‌దుప‌రి షెడ్యూల్ షూటింగ్ ఇంకా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది.