Begin typing your search above and press return to search.

సమంతా - నాగశౌర్య: అలా మొదలవుతుందట

By:  Tupaki Desk   |   17 Oct 2018 11:29 PM IST
సమంతా - నాగశౌర్య: అలా మొదలవుతుందట
X
దర్శకురాలు నందిని రెడ్డి పేరు వినగానే 'అలా మొదలైంది' సినిమా ప్రేక్షకుల మనసులో అలా మెదులుతుంది. నందిని లాస్ట్ సినిమా 'కళ్యాణ వైభోగమే'.. నాగ శౌర్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమాతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. కమర్షియల్ గా భారీ విజయాన్ని సాధించలేకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అ తరవాత మాత్రం నందిని వెబ్ సీరీస్ లను రూపొందించడంపై దృష్టి సారించింది.

తాజాగా ఈ లేడీ డైరెక్టర్ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ముందుకు రానుందట. ఒక ఇంట్రెస్టింగ్ స్టొరీతో సమంతా ను మెప్పించడంతో ఈ సినిమాలో లీడ్ రోల్ చేసేందుకు అక్కినేనివారి కోడలు ముందుకు వచ్చిందట. యువ హీరో నాగ శౌర్య ఒక కీలక పాత్రలో నటించడం మరో విశేషం. త్వరలో అధికారిక ప్రకటన రానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుండి ప్రారంభిస్తారట.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై D. సురేష్ బాబు నిర్మిస్తారట. ఈమధ్య కాలంలో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ నుండి అన్నీ స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలే వచ్చాయి. అందులోనూ కొన్ని పూర్తిగా ప్రయోగాత్మకమైన చిత్రాలు. మరోవైపు స్టొరీలో సత్తా ఉంటే గానీ సమంతా పచ్చజెండా ఊపదు.. ఈ లెక్కన నందిని ఓ మంచి సబ్జెక్టు తో ప్రేక్షకులను మెప్పించేలానే ఉంది