Begin typing your search above and press return to search.

స‌మంత‌తో ఇన్సెప్ష‌న్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్

By:  Tupaki Desk   |   19 March 2022 3:45 PM GMT
స‌మంత‌తో ఇన్సెప్ష‌న్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్
X
ట్రాన్స్ పోర్టర్స్ 3 .. ఇన్సెప్ష‌న్ సినిమాల‌ను త‌ల‌వ‌గానే ఈ రెండిటిలో వైవిధ్య‌మైన యాక్ష‌న్ కి అబ్బుర ప‌డ‌నివారుండ‌రు. యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీలో క్రియేటివిటీని పీక్స్ కి చేర్చిన సినిమాలివి. ఆ క్రియేటివిటీ వెన‌క మాస్ట‌ర్ బ్రెయిన్ ఒక‌రున్నారు. ఆయ‌నే యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్ యానిక్ బెన్. ది గ్రేట్ ట్యాలెటెంటెడ్ స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ అత‌డు.

సమంత థ్రిల్లర్ యశోద కోసం అత‌డు బ‌రిలో దిగుతుండ‌డం ఆస‌క్తిని పెంచుతోంది. ఈ మూవీలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల కోసం ప్లాన్ సిద్ధ‌మైంది. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ మాస్టర్ యానిక్ బెన్ బహుభాషా చిత్రంలో సమంత స్టంట్స్ కు కొరియోగ్రాఫ్ చేయడానికి వచ్చారు. యాన్నిక్ బెన్ వ‌ర‌ల్డ్ వైడ్ పాపుల‌ర్. ట్రాన్స్‌పోర్టర్ 3- ఇన్ సెప్షన్.. డంకిర్క్ లాంటి హాలీవుడ్ చిత్రాల్ని చేశారు. బాలీవుడ్ లో రాయీస్- టైగర్ జిందా హై- అత్తారింటికి దారేది- 1 నేనొక్కడినే స‌హా అనేక విదేశీ సినిమాలకు పనిచేశారు. అతను ఇంతకుముందు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం సమంతతో కలిసి పనిచేశాడు. ప్రతిభావంతులైన తొలి దర్శకత్వ ద్వయం హరి - హరీష్ ఇత‌ర‌ టీమ్ ఇటీవల హైదరాబాద్ లో హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ ను పూర్తి చేసారు.

ఆద్యంతం ర‌క్తి క‌ట్టించ‌నున్న థ్రిల్లర్ మూవీ పాన్ ఇండియా కేట‌గిరీలో విడుద‌ల కానుంది. తెలుగు- తమిళం- మలయాళం- హిందీ - కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ రాజీలేని బడ్జెట్ తో.. నిర్మాణ విలువలతో యశోద చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స‌మంత ఈ చిత్రంతో పాటు హాలీవుడ్ మూవీలోనూ న‌టించ‌నుంది. గుణ‌శేఖ‌ర్ తో శాకుంత‌లం విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది.