Begin typing your search above and press return to search.

బిబి4 మిస్టర్‌ కూల్‌ తో సమంత సందడి?

By:  Tupaki Desk   |   20 Dec 2020 5:20 PM IST
బిబి4 మిస్టర్‌ కూల్‌ తో సమంత సందడి?
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 విజేత ఎవరు అనేది మరి కొన్ని గంటల్లో అధికారికంగా క్లారిటీ రాబోతుంది. కాని చాలా మంది ఇప్పటికే మిస్టర్‌ కూల్‌ అభిజిత్ విజేతగా నిలవడం ఖాయం అంటున్నారు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 విన్నర్ కొన్ని వారాల క్రితమే నిర్ణయం అయ్యిందని అభిజిత్ తప్ప మరెవ్వరికి కూడా ఈ సీజన్‌ విన్నర్‌ అయ్యే అర్హత లేదు అంటూ ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. బిగ్‌ బాస్‌ విన్నర్‌ గా నిలిచి బయటకు రాబోతున్న అభిజిత్‌ కోసం చాలా మంది వెయిట్‌ చేస్తున్నారు. ఆ జాబితాలో సమంత కూడా ఉండబోతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం సమంత హోస్టింగ్‌ చేస్తున్న సామ్‌ జామ్‌ షో కోసం అభిజిత్ ను తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆహా ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అవుతున్న షో కోసం అభిజిత్ ను తీసుకు రాబోతున్నారు. నాగార్జునతో పాటు నాగచైతన్య అఖిల్‌ ఇంకా అమలా కు కూడా అభిజిత్ చాలా క్లోజ్‌. అందుకే సమంత చాలా ఈజీగా ఆయన్ను సామ్ జామ్‌ కు తీసుకు రావచ్చు అంటున్నారు. బిగ్‌ బాస్ విజేత అయిన వెంటనే అభిజిత్‌ తో సమంత టాక్ షో ఉంటుందని.. ఆ షోలో అక్కినేని హీరోలు నాగచైతన్య లేదా అఖిల్ ఉండే అవకాశం ఉందంటున్నారు. ప్రత్యేకంగా అమలా లేదా నాగార్జునలు వీడియో బైట్‌ కూడా ఇస్తారని అంటున్నారు. మొత్తానికి సామ్ జామ్‌ కోసం బిబి మిస్టర్‌ కూల్ అభిజిత్‌ రావడం అనేది ఖాయంగా కనిపిస్తుంది.