Begin typing your search above and press return to search.

తిరుమ‌లేశుని చెంత స‌మంత‌..!

By:  Tupaki Desk   |   12 Dec 2021 1:33 PM GMT
తిరుమ‌లేశుని చెంత స‌మంత‌..!
X
స‌మంత లైఫ్ జ‌ర్నీ ఒడిదుడుకుల నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నం స్ప‌ష్ఠ‌మ‌వుతోంది. త‌న‌లో ఇటీవ‌ల‌ చాలా మార్పులు క‌నిపిస్తున్నాయి. ప‌రిణామం ఏదైనా ఆ ప్ర‌భావం కెరీర్ పై ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతుంది. కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంత‌కాలు చేస్తూ కెరీర్ ని మ‌రింత వేగ‌వంతం చేసింది. భ‌విష్య‌త్ ని బాలీవుడ్ లోనే ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతోంది. తాజాగా స‌మంత నేడు తిరుమ‌ల శ్రీవెంక‌టేశ్వ‌ర‌స్వామి ద‌ర్శ‌నం చేసుకున్నారు. పాద‌యాత్ర చేసి స్వామి వారిని ద‌ర్శించుకుంది. స్వామివారిని ద‌ర్శించుకునే స‌మ‌యంలో స‌మంత ప‌ర్పుల్ క‌ల‌ర్ కుర్తా ధ‌రించింది. దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

నాగ‌చైత‌న్య తో విడాకుల త‌ర్వాత తిరుప‌తి వెళ్ల‌డం రెండ‌వ‌సారి. విడాకుల ప్ర‌క‌ట‌న అనంత‌రం దేశంలోని ఆధ్యాత్మిక మందిరాల్ని సంద‌ర్శించారు. ఆ త‌ర్వాత నేరుగా తిరుమ‌ల స్వామివారిని ద‌ర్శించుకున్నారు. మ‌ళ్లీ ఆదివారం స్వామి వారి సేవ‌లో త‌రించారు సామ్. చైతో విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత‌ తిరుప‌తి వెళ్లిన‌ప్పుడు సామ్ ని అక్క‌డి రిపోర్టులు విడాకుల కార‌ణాల గురించి ప్ర‌శ్నించిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మయంలో స‌మంత ఇలాంటి చోట కొంచెమైనా బుద్దుందా? అంటూ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. స‌మ‌యం..సంద‌ర్భం లేని ప్ర‌శ్న‌లు ఏమిటో అంటూ మండిప‌డింది. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కి విడాకుల గురించి వివ‌ర‌ణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

సినిమాల విష‌యానికి వ‌స్తే స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో `శాకుంత‌లం` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న చిత్ర ఇప్ప‌టికే షూటింగ్ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అలాగే మ‌రో రెండు తెలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. బాలీవుడ్ లో రెండు ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది. అందులో ఒక‌టి తాప్సీ సొంత నిర్మాణ సంస్థ‌లో న‌టిస్తోంది.