Begin typing your search above and press return to search.

సమంత దేవాలయాల సందర్శన.. హాట్ టాపిక్

By:  Tupaki Desk   |   18 Sep 2021 5:30 AM GMT
సమంత దేవాలయాల సందర్శన.. హాట్ టాపిక్
X
సినిమాల పరంగా ఎంతో ఎత్తుకు ఎదిగింది సమంత.. దక్షిణాది సినిమాల్లో.. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో తెగ బిజీగా ఉంటోంది. ఇటీవలే ఆమె నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్2’ మూవీ గ్రాండ్ సక్సెస్ అయ్యి సమంతకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆమె వ్యక్తిగత సంసార జీవితంపై మాత్రం బోలెడన్నీ గాసిప్పులు ప్రచారాలు వచ్చిపడ్డాయి.

అక్కినేని సమంతగా ఉన్న తన పేరును ‘సమంత రుతుప్రభు’గా సోషల్ మీడియాలో మార్చుకోవడంతో ఈ ప్రచారం మొదలైంది. అక్కినేని నాగచైతన్యతో సమంత విడిపోతోందని.. అందుకే ఆయన ఇంటిపేరు తీసేసిందన్న వాదన వినిపించింది. దీనిపై సమంతను నేరుగా ప్రశ్నించినా కూడా ‘సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి’ అని దాటవేసింది. దీంతో సమంత వివాహ బంధానికి బీటలు వారబోతున్నాయా? అన్న సందేహాలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే ఏమైందో కానీ సమంత ‘దేవాలయాల సందర్శన’ మొదలుపెట్టడం హాట్ టాపిక్ గా మారింది. నేడు చిత్తూరు జిల్లాలోని ప్రముఖ దేవాలయాలను సమంత సందర్శించింది. ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్నారు. మహాన్యాస ఏకదాశి రుద్రాభిషేకంలో పాల్గొన్న సమంత అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. వేద పండితులు ఆమెను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. జ్ఞాపికను బహూకరించారు.

అలాగే ఈ ఉదయం సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలకు చేరుకున్న సమంత వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.

ప్రస్తుతం సమంత కీలక పాత్రలో నటిస్తున్న ‘శాకుంతలం’ మూవీ ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. అలాగే తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా ఓ వెబ్ సిరీస్ కు సమంత సైన్ చేసినట్టు తెలుస్తోంది.