Begin typing your search above and press return to search.

తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌..స‌మంత రాకింగ్‌

By:  Tupaki Desk   |   15 March 2017 7:41 PM IST
తెలంగాణ బ్రాండ్ అంబాసిడ‌ర్‌..స‌మంత రాకింగ్‌
X
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మితురాలైన సినీన‌టి స‌మంత ఈ బాధ్య‌త‌ను క్రియాశీలంగా నిర్వ‌హిస్తున్నారు. తాజాగా జ‌నగామ జిల్లాలోని గుండాల గ్రామంలో ఆమె ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చేనేత సహాకార సంఘాన్ని పరిశీలించి అక్క‌డి స్థితిగ‌తుల‌ను అడిగి తెలుసుకున్నారు. సమంత గుండాలకు వ‌చ్చిన సంద‌ర్భంగా అక్క‌డ సంద‌డి నెల‌కొంది. ప‌లువురు చేనేత కార్మికులు త‌మ‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించారు.కొత్త త‌ర‌హా వస్త్రాల‌ను రూపొందించాల‌ని ఈ సంద‌ర్భంగా స‌మంత వారికి సూచించారు. టెక్నాల‌జీని అందిపుచ్చుకోవాల‌ని ఆమె కోరారు. చేనేత‌కు మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని ఈ సంద‌ర్బంగా వారిలో ధైర్యం నింపే ప్ర‌య‌త్నం చేశారు.

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ గా నియ‌మితురాలైన త‌ర్వాత స‌మంత మంత్రి కేటీఆర్ నియోజ‌క‌వర్గంలో మొద‌టగా ప‌ర్య‌టించారు. సిరిసిల్లలో చేనేత కార్మికుల వారిని క‌లుసుకున్న అనంత‌రం సమంత జ‌న‌గామ జిల్లాలో ప‌ర్య‌టించారు. మొత్తంగా చేనేత బ్రాండ్ అంబాసిడ‌ర్ హోదాలో స‌మంత రాష్ట్రమంత‌టా ప‌ర్య‌టిస్తున్నార‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/