Begin typing your search above and press return to search.

అభిమానుల‌ పై స‌మంత పోస్ట్ వైర‌ల్‌

By:  Tupaki Desk   |   26 Feb 2022 9:30 AM GMT
అభిమానుల‌ పై స‌మంత పోస్ట్ వైర‌ల్‌
X
స‌మంత సోష‌ల్ మీడియాలో నిత్యం యాక్టీవ్ గా వుంటూ వ‌రుస పోస్ట్ ల‌తో వైర‌ల్ అవుతున్నారు. ఇటీవ‌ల ఆమె పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట సంద‌డి చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా అభిమానుల‌తో సామ్ చేసిన వ్యాఖ్య‌లు ఇప్ప‌డు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. వివ‌రాల్లోకి వెళితే.. స‌మంత హీరోయిన్ గా `ఏమాయ చేసావే` సినిమాతో కెరీర్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. నాగ‌చైతన్య హీరోగా గౌత‌మ్ మీన‌న్ డైరెక్ష‌న్ లో ఇందిర ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోద‌రి మంజుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ వ‌చ్చి 12 ఏళ్ల‌వుతోంది.

విభిన్న‌మైన ప్రేమ‌క‌థ‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచి అటు నాగ‌చైత‌న్య‌కు, హీరోయిన్ గా స‌మంత‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ మూవీలో జెస్సీ గా న‌టించిన సామ్ ఆ త‌రువాత అబ్బాయిల క‌ల‌ల రాకుమారిగా మారి టాలీవుడ్ లో మంచి క్రేజ్‌ని సొంతం చేసుకుంది. తొలి చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని ద‌క్కించుకుని ఇండ‌స్ట్రీ వ‌ర్గాల దృష్టిని ఆక‌ర్షించిన స‌మంత అక్క‌డి నుంచి వెనుదిరిగి చూడ‌లేదు. క్రేజీ హీరోయిన్ గా బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫ‌ర్ల‌ని సొంతం చేసుకుంటూ దూసుకుపోయింది.

అన‌తి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని స్టార్ డ‌మ్ ని సొంతం చేసుకుంది. అంతే కాకుండా అత్యుత్త‌మ చిత్రాల్లో న‌టిస్తూ న‌టిగా మంచి గుర్తింపుని పొంద‌డ‌మే కాకుండా ప‌లు అవార్డుల్ని కూడా సొంతం చేసుకుంది. 2010లో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన స‌మంత విజ‌య‌వంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ ప్ర‌యాణంలో ఎన్నో ఎత్తు ప‌ల్లాల‌ని చూసింది. అంత‌కు మించిన క్రేజ్‌ని, ఫేమ్‌ని ద‌క్కించుకుని ఇప్ప‌టికీ అదే క్రేజ్ తో స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతుండ‌టం విశేషం.

స్టార్ డ‌మ్ సొంతం చేసుకున్న త‌రువాత ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు శ్రీ‌కారం చుట్టిన స‌మంత లేడీ ఓరియెంటెడ్ క‌థ‌ల‌కు ప్ర‌నాధాన్య‌త నిస్తూ వ‌స్తోంది. ఇందులో భాగంగా ఆమె న‌టించిన వెబ్ సిరీస్ `ఫ్యామిలీ మ్యాన్ -2`. ఆమె న‌టించిన తొలి వెబ్ సిరీస్ ఇది. ఇందులో రాజీగా బోల్డ్ పాత్ర‌లో న‌టించి నేష‌న‌ల్ వైడ్ గా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంది. ఈ సిరీస్ ఓటీటీలో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో సామ్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.

ప్ర‌స్తుతం సూప‌ర్ నేచుర‌ల్ ప‌వ‌ర్స్ నేప‌థ్యంలో రూపొందుతున్న `య‌శోద‌` చిత్రంలో న‌టిస్తోంది. ఆమె సై అంటే ప్ర‌ముఖ ఓటీటీ కంప‌నీలు అమెజాన్ ప్రై, నెట్ ఫ్లిక్స్ క్రేజీ ఆఫ‌ర్లు ఇవ్వ‌డానికి రెడీ అయిపోతున్నాయి. కానీ సామ్ మాత్రం ఇంత వ‌ర‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌లేదు. న‌టిగా 12 ఏళ్లు ప్ర‌యాణాన్ని పూన్తి చేసుకున్న సంద‌ర్భంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా స‌మంత షేర్ చేసిన పోస్ట్ ఆస‌క్తిక‌రంగా మారింది. `చిత్ర ప‌రిశ్ర‌మ‌లో న‌టిగా నా ప్రయాణం మొద‌లై నేటితో 12 ఏళ్లు పూర్త‌య్యాయి. లైట్స్ , కెమెరా యాక్ష‌న్ .. వీట‌న్నింటి చుట్టూ నాకున్న మ‌ధుర జ్ఞాప‌కాలు.. అద్భుతమైన అనుభూతుల‌కు 12 ఏళ్లు.

ఇన్నేళ్ల గొప్ప ప్ర‌యాణం, ప్ర‌పంచ వ్యాప్తంగా నిస్వార్థ‌మైన అభిమానుల్ని పొందినందుకు ఆనందంగా వుంది. కెమెరాతో నా ప్రేమ‌క‌థ ఇలాగే ఎంతో కాలం కొన‌సాగాల‌ని కోరుకుంటున్నా` అని స‌మంత పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైర‌ల్ గా మారింది. చైతో విడాకులు తీసుకున్న స‌మంత త‌న తొలి చిత్రం గురించి ఆస‌క్తిక‌రంగా పోస్ట్ పెట్ట‌డం అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది.